తెలంగాణ

కడెం ప్రాజెక్టు 4 వరదగేట్ల ఎత్తివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడెం, సెప్టెంబర్ 22: నిర్మల్ జిల్లాలోని మండల కేంద్రమైన కడెంలో గల కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టుకు వరదనీరు వచ్చి చేరుతుండడంతో జలాశయం నీటి మట్టం పెరుగుతూ వస్తుంది. కాగా గత రెండు రోజుల నుండి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల మూలంగా కడెం జలాశయంలో వేలాది క్యూసెక్కుల వరదనీరు వచ్చిచేరుతుండడంతో నీటిపారుదలశాఖ అధికారులు అప్రమత్తమై శనివారం అర్ధరాత్రి కడెం ప్రాజెక్టుకు చెందిన 5, 7, 11, 12 నెంబర్లు గల వరదగేట్లను 10 ఫీట్ల వరకు పైకిలేపి దాదాపు 56 వేల క్యూసెక్కుల వరదనీటిని గోదావరిలోకి వదిలారు. ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలమూలంగా జలాశయంలోకి వరదనీరు వచ్చిచేరుతుండడంతో అధికారులు అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కడెం ప్రాజెక్టులో 11100 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వరదనీరు వచ్చిచేరుతుందని అధికారులు తెలిపారు. శనివారం సాయంత్రానికి కడెం జలాశయం నీటిమట్టం 698.500లకు ఉండగా కడెం ప్రాజెక్టు ఎడమ కాలువకు 545 క్యూసెక్కులు, కుడి కాలువకు 30 క్యూసెక్కుల నీటి సరఫరా కొనసాగుతుందని ప్రాజెక్టు అధికారులు పేర్కొన్నారు.