తెలంగాణ

‘సంక్షేమం’లో దేశానికే ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, సెప్టెంబర్ 22: అన్ని వర్గాల వారి అభ్యున్నతి కోసం వేల కోట్ల రూపాయలతో విరివిగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. అంతేకాకుండా పేద వర్గాల వారికి అందిస్తున్న రుణాలలో భారీగా సబ్సిడీలను సైతం వర్తింపజేస్తున్నది తెలంగాణ ప్రభుత్వమేనని అన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 100శాతం సబ్సిడీపై 589మంది బీ.సీ వర్గానికి చెందిన లబ్ధిదారులకు 50వేల రూపాయల చొప్పున మంజూరైన రుణాల చెక్కులను శనివారం మంత్రి పోచారం తన చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ, పేద కుటుంబాల ఆర్థిక పరిస్థితిని ఎలాగైనా మెరుగుపర్చాలనే బలమైన సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా ప్రభుత్వం తరఫునే పూర్తిస్థాయి సబ్సిడీతో బీ.సీలకు ఈ రుణాలను అందిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలోని జనాభాలో 70శాతం మంది రైతులు, 85శాతం మంది పేదలే ఉన్నారని, దీనిని దృష్టిలో పెట్టుకుని దేశంలోని మరే ఇతర రాష్ట్రంలో లేనివిధంగా వారి అభ్యున్నతికై సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసిన ఘనత తెరాస ప్రభుత్వానికే దక్కిందన్నారు.
రుణాల మంజూరీ కోసం బ్యాంకుల నుండి ఎదురయ్యే ఇబ్బందులను గమనించి, పేదలకు ప్రభుత్వమే నేరుగా ఆర్థిక సహాయం అందించడానికి మంత్రి జోగు రామన్న నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీని నియమించి, వారి సిఫార్సుల మేరకు ఈ రుణాలను మంజూరు చేస్తున్నారని చెప్పారు. మొదటి కేటగిరీ కింద 50వేల రూపాయల వరకు వంద శాతం సబ్సిడీతో, 2వ కేటగిరీ కింద లక్ష రూపాయల వరకు రుణాలపై 80శాతం సబ్సిడీని, 3వ కేటగిరీ కింద 2లక్షల వరకు రుణాలపై 70శాతం సబ్సిడీగా అందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం 50వేల రుణాల కోసం జిల్లాలో 4800మంది దరఖాస్తులు చేసుకోగా, వాటిని పరిశీలించిన అధికార యంత్రాంగం అర్హులైన 589మందిని ఎంపిక చేసిందని, వారికి ప్రస్తుతం పూర్తిస్థాయి సబ్సిడీతో 50వేల చొప్పున చెక్కులు అందిస్తున్నామని వివరించారు. 2, 3వ కేటగిరీల వారికి కూడా త్వరలోనే రుణాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కుల వృత్తులపై ఆధారపడిన వారికి ఈ రుణాలు ఎంతగానో తోడ్పాటుగా నిలుస్తాయని, వారు ఆర్థికాభ్యున్నతి సాధించేందుకు రుణాలను సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ ఆకుల సుజాత, డీసీసీబీ చైర్మెన్ గంగాధర్‌రావు పట్వారి, బీసీ సంక్షేమ శాఖ అధికారి ఉదయ్‌ప్రకాశ్, సిరికొండ జడ్పీటీసీ సుజాత, ఎడపల్లి ఎంపీపీ యమున తదితరులు పాల్గొన్నారు.