తెలంగాణ

ట్రిపుల్ ఐటీకి సెలవులు ప్రకటించిన యాజమాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాసర, సెప్టెంబర్ 25: నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీకి యాజమాన్యం సెలవులను ప్రకటించడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. గత రెండు రోజులుగా జరుగుతున్న విద్యార్థులు శాంతియుత నిరసన మంగళవారం రాత్రి వరకూ కొనసాగింది. ఉదయం 9 గంటల నుండి ప్రారంభమైన నిరసన పలు దఫాలుగా భైంసా ఆర్డీవో రాజు, భైంసా డీఎస్పీ రాజేష్ భల్లా విద్యార్థులతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. యూనివర్సిటికి రెగ్యులర్ వైస్ చాన్స్‌లర్‌ను నియమించాలని, యూనివర్సిటిలో నెలకొన్ని సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్‌చేశారు. ఉదయం నుండి నిరసన దీక్షలో ఉన్న పలువురు విద్యార్థినులు స్పృహతప్పి పడిపోయారు. వీరిని స్థానిక ట్రిపుల్ ఐటీకి తరలించి చికిత్స నిర్వహించారు. విద్యార్థులు ఇన్‌చార్జి కళాశాల వైస్ చాన్స్‌లర్‌తో మాట్లాడుతూ యూనివర్సిటీలో 24 గంటలపాటు లైబ్రరీ అందుబాటులో ఉంచాలని, రెండు దశలలో మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, ఫ్యాకల్టీ సిబ్బందిని భర్తీచేయాలని మద్రాస్ ఐఐటీకి ఫ్యాకల్టీ, విద్యార్థి బృందాన్ని పంపి అక్కడ విద్యాభివృద్దికి చేస్తున్న కృషిని ఇక్కడ అమలుచేయాలని విద్యార్థులు సూచించారు. వీటితోపాటు పలు డిమాండ్లను విద్యార్థులు వైస్ చాన్స్‌లర్‌తో నివేదించారు. తమకు లిఖితపూర్వకంగా వైస్ చాన్స్‌లర్‌చే డిమాండ్లను అంగీకరిస్తూ లేఖను విడుదల చేయాలని కోరడంతో కళాశాల వైస్ చాన్స్‌లర్ డాక్టర్ ఎ.అశోక్ యూనివర్సిటీ సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించి విద్యార్థులు కోరిన 25 డిమాండ్ల లేఖను అంగీకరిస్తూ విద్యార్థులకు అందజేశారు. యూనివర్సిటికి సెలవు ప్రకటించవద్దని విద్యార్థులు కోరినప్పటికీ వైస్ చాన్స్‌లర్ నేటి నుండి యూనివర్సిటికి సెలవులు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. శాంతియుతంగా నిరసనలు చేపడుతున్న తమను టార్గెట్‌చేస్తున్నారని, అందుకే డిమాండ్లతోకూడిన వినతిపత్రాన్ని అందించడం జరిగిందని పలువురు విద్యార్థులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ భాస్కర్‌రావు, పరిపాలన అధికారి వెంకటస్వామి, ఆర్డీవో రాజు, భైంసా డీ ఎస్పీ రాజేశ్ భల్లా ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు.