తెలంగాణ

కొల్లాపూర్ కీర్తిని ప్రపంచానికి చాటుదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొల్లాపూర్, అక్టోబర్ 7: ‘చాణుక్యుల పాలన నుంచి సురభిరాజుల వరకు వివిధ రాజవంశీయులు కొల్లాపూర్ సంస్థానాన్ని పరిపాలించారు.. ఎందరో మహానుభావులు పుట్టిన గడ్డ కొల్లాపూర్ కీర్తిని ప్రపంచానికి చాటుదాం’ అని శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా కల్లాపూర్‌లోని రాజావారి బంగ్లా ముందు జూపల్లి రంగారావు కళాప్రాంగణంలో రత్నగిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొల్లాపూర్ సంబరాలను స్వామిగౌడ్ అమరవీరులకు నివాళులు అర్పించి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు కొల్లాపూర్ పట్టణంలో హైస్కూల్ కూడాలేదని, నేడు డిగ్రీ, పీజీ కళాశాలలు నడుస్తున్నాయని అన్నారు. కృష్ణానది జలాలతో సిరుల పంటలు పండుతున్నాయని అన్నారు. రత్నగిరి ఫౌండేషన్ ఈ ప్రాంత ప్రజల పట్టుదలతో నేడు కొల్లాపూర్ ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. మన సంస్కృతిని, అభివృద్ధిని సంబరాల ద్వారా పదిమందికీ తెలియచేయడంలో రత్నగిరి ఫౌండేషన్ చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త రామేశ్వర్‌రావు, ప్రముఖ కవి ఎల్లూరి శివారెడ్డితోపాటు ఎందరో కవులు, రచయితలు, వివిధ రంగాలలో పేరుతెచ్చుకున్న వారు ఎంతోమంది ఉన్నారని వారందరిని ఒకచోటుకు తెచ్చి సంబరాల ద్వారా ఆప్యాయతను పంచుకుంటున్నారని అన్నారు. కృష్ణమ్మ నీటితో కళకళలాడుతున్న పంటలు, అభివృద్ధి చూస్తుంటే ఎక్కడో దూరం నుంచి వచ్చిన దేశ, వీదేశాలలో ఉన్న వారందరినీ కొల్లాపూర్ అబ్బురపరుస్తుందని అన్నారు. మంత్రి జూపల్లి మాట్లాడుతూ రత్నగిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు, విద్యార్థులకు కంప్యూటర్‌లో శిక్షణ, రామానందా తీర్థాస్వామి సంస్థ భాగస్వామ్యంతో వివిధ వృత్తులలో శిక్షణ, నిరుద్యోగులకు పలు కార్యక్రమాలను చేపట్టిందన్నారు. కొల్లాపూర్ సంబరాలను కూడా నిర్వహిస్తూ ప్రజల ఆదారాభిమానాలు చూరగొన్నదని కొనియాడారు. అంతకుముందు వివిధ వాయిద్యాలు, ఆటపాటలతో పాటు నియోజకవర్గంలోని అన్నీగ్రామాల నుంచి వచ్చిన వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో కలిసి ఊరేగింపు నిర్వహించారు.
సభలో ప్రముఖ యాంకర్ మంగ్లీ, సుజాతల కార్యక్రమాలతోపాటు స్థానిక పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, శివారెడ్డి మిమిక్రీలతోపాటు సంబరాలకు వచ్చిన వివిధ రంగాలలో ప్రావీణ్యం కలిగిన వారికి సన్మాన కార్యక్రమాలు జరిగాయి.