తెలంగాణ

ఐదు రాష్ట్రాల్లో గెలుపు మాదే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పొల్సాని మురళీధర్‌రావు
కరీంనగర్, అక్టోబర్ 7: డిసెంబర్ 7న ఐదు రాష్ట్రాల్లో జరుగనున్న సెమిఫైనల్‌లో గెలుపు బీజేపీదేనని ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పొల్సాని మురళీధర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం నగరంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, గత ఐదేళ్ళలో దేశంలోప్రధాని మోదీ చేపట్టిన అభివృద్ధి పనులే ఆయనను మరోసారి గద్దెనెక్కించబోతున్నాయన్నారు. తెలంగాణ అభివృద్ధికి నాలుగేళ్ళపాటు పాలన సాగించిన టీఆర్‌ఎస్సే అడ్డంకిగా మారిందని ఆరోపించారు. కుటుంబ రాజకీయాలతో ఏకపక్ష పాలన సాగిస్తూ, నియంతృత్వ పోకడలతోనిజాం వారసుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చరమగీతం పాడేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధమవుతున్నారని అన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనన్నారు. కాంగ్రెస్, తెరాసలు రెండు ఒకే తాను గుడ్డలని విమర్శించారు. ప్రత్యేక ఉద్యమానికి గుండెకాయగా నిలిచిన ఉత్తర తెలంగాణ నుంచి గత ఎన్నికల్లో 43 సీట్లకు గాను 35సీట్లలో టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే, ఒరగబెట్టిందేమి లేదన్నారు. అవినీతి, మద్యం, కమీషన్లు, మాఫియాలతోకూడిన పాలన అందించిందని దుమ్మెత్తారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా, దళిత, బడుగు, బలహీన వర్గాలను నట్టేట ముం చిందన్నారు. రాజ్యాంగబద్ధమైన విధానాలు వీడి, కేవలం ధూషణలు, బూతులకే ప్రాధాన్యత నిస్తూ, ప్రజాస్వామ్యానే్న అపహస్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆరోపణల్లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు దొందూ దొందేనని, రెండింటి డిఎన్‌ఏ ఒకటేనన్నారు. కాంగ్రెస్‌కు వేసే ప్రతి ఓటు తెరాసకు వేసినట్లేనని, ఇందుకు నిదర్శనమే ఇటీవల కర్ణాటక ఎన్నికలని గుర్తుచేశారు. ఆరాష్ట్రంలోజెడిఎస్, కాంగ్రెస్ కలయికను ఉదహరించారు.కేంద్రం నిధులతోఅభివృద్ధిపథంలోపయనిస్తున్న బంగారు తెలంగాణను బూతుల రాష్ట్రంగా మారనివ్వబోమన్నారు. రెండు లక్షల కోట్లకు పైగా రాష్ట్రం అభివృద్ధికి నిధులు కేటాయిస్తే, అదంతా తమదేనంటూ చెప్పుకోవటం సిగ్గుచేటని, రాష్ట్ర పురోగతికి పాటుపడుతున్నదెవరో చర్చించేందుకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు.
ఈనెల 10న నగరంలో నిర్వహించబోయే బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా బహిరంగ సభలో అభివృద్ధి ఏజెండా ప్రకటిస్తామని తెలిపారు. మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, గుజ్జుల రామకృష్ణారెడ్డి, మార్తినేని ధర్మారావు, నాయకులు కె.శ్రీనివాస్‌రెడ్డి, పెండ్యాల సాయికృష్ణారెడ్డి, జానపట్ల స్వామి, పొల్సాని సుగుణాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.