తెలంగాణ

ఆయన ధ్యాసంతా కొడుకు, కూతురిపైనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 10: రాష్ట్రంలో గత నాలుగున్నరేళ్లుగా అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం చేసిన వాగ్దానాలు, నమ్మకద్రోహాలు ప్రజలకు వివరించి చెబితే చాలు ప్రజలు బీజేపీకి అనుకూలంగా ఓటు వేస్తారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పేర్కొన్నారు. ముందస్తు ఎన్నికల్లోభాగంగా అమిత్ షా రెండో విడత హైదరాబాద్‌కు వచ్చారు. రాజధాని నగరంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన సాయంత్రం కరీంనగర్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. అనంతరం తిరిగి హైదరాబాద్ వచ్చిన అమిత్ షా రాత్రి పార్టీ నాయకులతో భేటీ అయ్యారు. ఉదయం 11 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న అమిత్ షాకు పార్టీ సీనియర్ నేతలు అంతా ఘనస్వాగతం పలికారు. అక్కడి నుండి ఆయన బంజారాహిల్స్‌లోని కళింగ భవన్ వద్ద ఉన్న అగ్రసేన్ మహరాజ్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అక్కడి నుండి ఆయన కాచిగూడలోని శంబాబా ఆలయాన్ని సందర్శించారు. అక్కడ సాధు సంత్‌లు అమిత్ షాకు ఘనస్వాగతం పలికారు. అక్కడే వారితో భేటీ అయ్యారు.
తిరుమలలో ఘటనలపై ఆరా
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఘటనలపై అమిత్ షా దృష్టికి సాధు సంత్‌లు వివరించినట్టు తెలిసింది. ఇదే సందర్భంగా రామాలయం అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్టు చెబుతున్నామరు. తెలంగాణలో హిందువులపై దాడులు, రొహింగ్యాల అక్రమ నివాసం, ఎంఐఎం ఆగడాలు, శ్రీపీఠం అధినేత పరిపూర్ణానంద నగర బహిష్కారం తదితర అంశాలు చర్చకు వచ్చినట్టు తెలిసింది. దాడులకు పాల్పడుతున్న వారికి అండగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటోందని సాధు సంత్‌లు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. మధ్యాహ్నం 12 గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగిన పోలింగ్ బూత్ కార్యకర్తలతో ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గాలకు చెందిన బూత్ కమిటీ అధ్యక్షులు, కార్యదర్శులు ఆపై స్థాయి నాయకులకు పార్టీ లక్ష్యాలను వివరించారు. బీజేపీ అధికారంలోకి వస్తే కొడుకులు, కూతుళ్లు అధికారంలో ఉండరని అమిత్ షా వ్యంగ్యాస్త్రాలను సంధించారు. 2019లో ప్రధాని నరేంద్రమోదీ గాలిలో కేసీఆర్ కొట్టుకుపోతామనే భయంతోనే ఆరు నెలలు ముందుగానే ఎన్నికలకు వెళ్లారని అమిత్ షా వ్యాఖ్యానించారు. అభివృద్ధి కోసమే ఎన్నికలకు వెళ్లామని టీఆర్‌ఎస్ కట్టుకథలు చెబుతోందని, కానీ ఎన్నికల తర్వాత కొడుకు లేదా కుమార్తెను సీఎంను చేయడానికే ముందస్తుకు వెళ్లారని అమిత్ షా వ్యాఖ్యానించారు. మతం ఆధారంగా రిజర్వేషన్లను బీజేపీ ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. బంగ్లాదేశ్ నుండి చొరబాటుదార్లు వస్తే ఇక్కడి ప్రజల గురించి కేసీఆర్ కనీసం ఆలోచించలేదని , కేసీఆర్ యూపీఎలో మంత్రిగా ఉన్నారని ఆనాడు ఈ రాష్ట్రానికి దక్కింది కేవలం 16,597 కోట్లు మాత్రమేనని, బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి 2.32 లక్షల కోట్లు ఇచ్చిందని, ఆ నిధులు అంతా ఏమయ్యాయో నిలదీయాలని అన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా కాంగ్రెస్ తీరు, టీఆర్‌ఎస్ వైఫల్యాలు, బీజేపీ అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళిక గురించి వారికి వివరించారు. సమావేశ అనంతరం ఆయన తిరిగి పార్టీ కార్యాలయానికి చేరుకుని బీజేపీ అల్పాహారాన్ని స్వీకరించారు. రెండు గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుండి ప్రత్యేక హెలికాప్టర్‌లో కరీంనగర్‌లో నిర్వహించిన ఎన్నికల సమరభేరి సభకు హాజరయ్యారు. అక్కడి నుండి హైదరాబాద్ చేరుకున్న అమిత్ షా స్వల్ప విరామం అనంతరం 119 నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, పార్టీ బాధ్యులతో మాట్లాడారు. అమిత్ షాతో పాటు పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి పీ మురళీధరరావు, కేంద్ర ఆరోగ్యమంత్రి జేపీ నడ్డా, బండారు దత్తాత్రేయ, తెలంగాణ ఇన్‌ఛార్జి పీ కృష్ణదాస్, జీ కిషన్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ఎన్ రామచందర్‌రావు, పేరాల శేఖర్ రావు తదితరులు పాల్గొన్నారు.