తెలంగాణ

16 సీట్లూ ఇవ్వాల్సిందే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 14: మహాకూటమిలోని పార్టీల మధ్య ఇంకా సీట్ల సర్దుబాటు కొలిక్కి రాలేదు. 48 గంటల్లో తమకు 16 సీట్లు కేటాయించకపోతే ప్రత్యామ్నాయం చూసుకుంటామని తెలంగాణ జన సమితి (టీజేఎస్) ఖండితంగా చెప్పినట్లు సమాచారం. రాష్ట్రంలో 17 లోక్‌సభ సీట్లు ఉండగా, అందులో హైదరాబాద్ లోక్‌సభ స్థానాన్ని మినహాయించి మిగతా 16 స్థానాల్లో ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ చొప్పున మొత్తం 16 సీట్లు కావాలని టీజేఎస్ చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ పట్టుదలతో ఉన్నారు. అందుకు కాంగ్రెస్ నేతలు టీజేఎస్‌కు 7 స్థానాలకు మించి ఇవ్వలేమని ఖండితంగా చెప్పడంతో ప్రొఫెసర్ కోదండరామ్ చర్చలకు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ కోదండరామ్ అలక పాన్పు ఎక్కారన్న సమాచారం తెలుసుకున్న టీడీపీ నేత ఎల్. రమణ, సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి శనివారం ఆయనకు నచ్చజెప్పారు. ఇలాఉండగా టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్‌ను సీఎల్‌పీ మాజీ నేత కే. జానారెడ్డితో చర్చించాల్సిందిగా కాంగ్రెస్ నాయకత్వం సూచించడంతో, ప్రొఫెసర్ కోదండరామ్, మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్, అడ్వకేట్ రచనా రెడ్డి తదితరులు ఆయన నివాసానికి వెళ్ళారు. ఈ సందర్భంగా వారు నాలుగేళ్ళుగా ప్రభుత్వంపై చేస్తున్న పోరాటాన్ని వివరించారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో పోటీ చేసేందుకు సుమారు 10 మంది ఆశావాహులు ఉన్నారని వారు చెప్పారు. కేవలం ఓట్లు చీలిపోరాదన్న భావనతో తాము ఓపిక పడుతున్నామని వారు తెలిపారు. కాబట్టి 48 గంటల్లో తమకు 16 సీట్లు ఇస్తున్నట్లు ప్రకటించాలని, లేదంటే ప్రత్యామ్నాయం చూసుకుంటామని ఖండింతంగా చెప్పినట్లు సమాచారం. దీనికి జానారెడ్డి స్పందిస్తూ ఈ ఆవేదనను అర్థం చేసుకున్నానని, మీరు చెప్పిన విషయాలను పార్టీ నాయకత్వానికి వివరిస్తానని చెప్పారు. పార్టీ నాయకత్వం చెప్పే విషయాన్ని మళ్లీ మీకు తెలియజేస్తానని ఆయన తెలిపారు. కాంగ్రెస్ 90 స్థానాల్లో పోటీ చేయాలనుకుంటున్నదని, అవసరమైతే ఒకటి, రెండు సీట్లు తగ్గించుకోగలం కానీ సగం సీట్లను పొత్తులో మిత్రపక్షాలకు ఇవ్వలేమని జానారెడ్డి వారికి చెప్పారు.