తెలంగాణ

పంచాయతీ కార్యదర్శి రిక్రూట్‌మెంట్ కీ విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 17: జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టులకు నిర్వహించిన రాత పరీక్ష ప్రాధమిక కీని విడుదల చేశారు. రాత పరీక్ష ప్రాధమిక కీని టీఎస్‌పీఆర్ రిక్రూట్‌మెంట్ డాట్ ఇన్ అనే వెబ్ పోర్టల్‌లో ఉంచినట్టు అధికారులు తెలిపారు. ఎంపిక పరీక్షను అక్టోబర్ 10వ తేదీన నిర్వహించారు. 9355 పోస్టులకు గానూ 5,62,495 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో తొలి పేపర్‌కు 4,77,637 మంది హాజరుకాగా, రెండో పేపర్‌కు 4,75,012 మంది హాజరయ్యారు. 31 జిల్లాల్లోని 44 పట్టణాల్లో 1288 కేంద్రాల్లో ఈ ఎంపిక పరీక్షను నిర్వహించారు. తొలి కీపై ఏమైనా అభ్యంతరాలుంటే వాటిని ఆన్‌లైన్‌లో ఈ నెల 20వ తేదీ 5 గంటల లోపు తెలియజేయాలని అధికారులు సూచించారు.

వెళ్లిపోయిన నైరుతీ రుతుపవనాలు
* 20 తర్వాత ఈశాన్య రుతుపవనాలు * ఐఎండి వెల్లడి
హైదరాబాద్, అక్టోబర్ 17: తెలంగాణ రాష్ట్రం నుండి నైరుతీరుతుపవనాలు బుధవారం వెళ్లిపోయాయి. దేశం నుండి ఈ నెల 20 వరకు ఇవి వెళ్లిపోతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది. నైరుతీరుతుపవనాలు వెళ్లిపోతూ, వెళ్లిపోతూ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలను కురిపించి వెళ్లిపోవడం గమనార్హం. ఇలా ఉండగా ఈశాన్య రుతుపవనాలు ఈ నెల 20 తర్వాత ప్రవేశిస్తాయని ఐఎండీ ప్రకటించింది.