తెలంగాణ

ముందస్తుతో అభివృద్ధికి ఆటంకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లాదుర్గం, అక్టోబర్ 16: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు పెట్టడం రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కాదా అని అందోల్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి బాబుమోహన్ అన్నారు. ప్రజలు ఐదు సంవత్సరాల కోసం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తెరాస ప్రభుత్వం తొమ్మిది నెలల ముందే ప్రభుత్వాన్ని రద్దు చేయడంతో అభివృద్ధి వెనక్కిపోయిందన్నారు.
మంగళవారం అల్లాదుర్గంలో బాబుమోహన్ విలేఖరులతో మాట్లాడుతూ ముందస్తు ఎన్నికలు ఎందుకు పెట్టారో ప్రజలు గమనిస్తున్నారన్నారు. కేంద్రం నుండి వచ్చే నిధులు రావని, దీంతో అభివృద్ధి వెనక్కి పోతుందన్నారు. మళ్లీ ఎన్నికలు జరిగి ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల తరువాత అభివృద్ధి మొదలవుతుందన్నారు. కేంద్రంలో పకడ్బందీగా పాలన చేస్తున్న పార్టీ బీజేపీ అని, ప్రధాని మోడీ, పార్టీ అధ్యక్షులు అమీత్‌షాలు పార్టీని ప్రగతి పథంలో నడుపుతున్నారని, అందువల్లే బీజేపీ అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. తాను అందోల్ నుండి ఎమ్మెల్యేగా గెలుపొంది ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశానని, నేడు బీజేపీ నుండి పోటి చేసిన ప్రజల అండదండలు ఉంటాయని ఆయన తెలిపారు. తాను అందోల్ నియోజకవర్గం నుండి ఈ ఎన్నికల్లో గెలిచినా ఓడినా తనకు ప్రధాని అండదండలు ఉంటాయన్నారు. నియోజకవర్గంపై కేంద్రం ప్రత్యేక దృష్టి సాధించి తనను బీజేపీ అభ్యర్థిగా పో చేయిస్తుందన్నారు. తెరాస తనకు కారణం లేకుండా టికెట్ ఇవ్వకపోవడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. తెరాస నాయకులు గ్రామాల్లో ప్రచారానికి వెళ్తె ప్రజలు నిలదీస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో తెరాస ప్రభుత్వానికి 40 సీట్లు కూడా రావని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ పార్లమెంటరీ ఇన్‌చార్జి ప్రభాకర్‌గౌడ్, జిల్లా నాయకులు కులకర్ణి, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.