తెలంగాణ

సీబీఎస్‌ఈ నిబంధనల్లో మార్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 19: పాఠశాలల అనుబంధ గుర్తింపునకు సంబంధించి సీబీఎస్‌ఈ నిబంధనల్లో మార్పు చేసింది. అయితే తాజాగా రూపొందించిన నిబంధనలపై విద్యావేత్తలు, ఉదపాధ్యాయ సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న కఠిన నిబంధనలను నీరుగార్చడమేనని వారు పేర్కొంటున్నారు. పునర్వ్యవస్థీకరణ పేరుతో ఉన్న నిబంధనలను సైతం సీబీఎస్‌ఈ గాలికి వదిలేస్తోందని విద్యావిశే్లషకుడు ఎన్ నారాయణ పేర్కొన్నారు. నిబంధనలను సడలించడం ద్వారా సీబీఎస్‌ఈ తన బాధ్యతనుండి తప్పుకుంటున్నట్టు కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. స్థానిక రాష్ట్రాలకు సైతం కొన్ని అధికారాలను కట్టబెడితే ప్రస్తుతం ఆశిస్తున్న ప్రమాణాలు కూడా ఊహించలేమని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల ఫీజుల రూపంలో తల్లిదండ్రులపై ఎనలేని భారం పడేప్రమాదం ఉందని ఆయన అన్నారు. ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండానే అనుబంధ గుర్తింపు పొందడం కార్పొరేట్ సంస్థలకు ఇపుడు మరింత తేలికవుతుందని ఆయన పేర్కొన్నారు.

అడ్మిషన్ల దరఖాస్తుకు చివరి తేదీ
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ- బిఏ, బీకాం, బిఎస్సీ, పీజీ - ఎంఎ, ఎం కాం, ఎంఎస్సీ, ఎంబిఏ కోర్సుల్లో చేరడానికి శనివారం ఆఖరు తేదీ అని విశ్వవిద్యాలయం అధికారులు తెలిపారు. వివరాలకు వర్శిటీ పోర్టల్ సందర్శించాలని, టెలిఫోన్ ద్వారా 7382929570/ 580/ 590/ 600 నెంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని అధికారులు సూచించారు. కాగా వర్శిటీలో బిఈడీ స్పాట్ అడ్మిషన్లు 20వ తేదీన జరుగుతాయని అన్నారు. అదే విధంగా బిఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ స్పాట్ అడ్మిషన్లు 22వ తేదీన నిర్వహిస్తున్నట్టు అధికారులు చెప్పారు. రెండు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న బిఈడీ, బిఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సులకు సంబంధించిన సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్ ప్రక్రియను హైదరాబాద్‌లోని విశ్వవిద్యాలయ ప్రధాన కార్యాలయంలో నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.