తెలంగాణ

ముగ్గురి ఉసురు తీసిన కుటుంబ కలహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ వనస్థలిపురం, అక్టోబర్ 19: ఆర్థిక సమస్యలు, భార్య భర్తల మధ్య గోడవ ముగ్గురు ప్రాణాలను బలిగొంది. ఈ విషాదం ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్సూరాబాద్ వీకర్ సెక్షన్ కాలనీలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు కథనం ప్రకారం వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ గ్రామానికి చెందిన రమేష్, స్రవంతి (25) బతుకు దెరువుకోసం నగరానికి వచ్చారు. ఎల్బీనగర్ వీకర్ సెక్షన్ కాలనీలో నివాసం ఉంటూ కూలిపని చేసుకుంటు జీవనం సాగిస్తున్నారు. కొంతకాలం పాటు వీరి సంసారం సుఖంగా కొనసాగింది. వీరికి సాయి తేజ (11), సాత్విక చిట్టి (7) సంతానం ఇద్దరు కలిగారు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఇద్దరూ విడిగా ఉంటున్నారు. రమేష్ సొంతూరు స్టేషన్‌ఘన్‌పూర్‌లో నివాసం ఉంటున్నాడు. స్రవంతి వీకర్ సెక్షన్ కాలనీలో తన తల్లి వద్దే ఉంటూ కూలికి వెళ్తూ ఇద్దరు పిల్లలను పోషించుకుంటోంది. అయతే పెద్దల సమక్షంలో భార్యాభర్తలను కలపాలని పండుగా తర్వాత పంచాయితీ పెట్టారు. భర్తపై ఇష్టం లేకపోవడం, ఆర్థిక సమస్యలను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. శుక్రవారం ఉదయం అన్నంలో విషం కలిపి ఇద్దరు పిల్లలకు పెట్టి తాను తిన్నది. అపస్మారక స్థితిలో ఉన్న ముగ్గుర్ని స్రవంతి తల్లి గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించింది. చికిత్స పొందుతూ తల్లి, ఇద్దరు పిల్లలు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.