తెలంగాణ

కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లను ప్రజలే తిప్పికొడతారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 19: అస్సాం , త్రిపుర తరహాలోనే తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత జీ కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీని విస్తరించుకునేందుకు మంచి అవకాశాలు ఉన్నాయని, అందువల్ల తెలంగాణ ద్రోహులు, అవకాశవాదులతో కలవకుండాఅనే తాము నేరుగా పోటీలోకి దిగుతున్నామని అన్నారు. తెలంగాణ ద్రోహులకు పెద్ద పీట వేసి, తెలంగాణ అమరవీరులకు మాత్రం టీఆర్‌ఎస్ ద్రొహం చేసిందని, ఆ పార్టీకి గట్టిగా బుద్ధి చెబుతామని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో బీజేపీ చిత్తశుద్ధితో పనిచేస్తోందని, పంచాయతీ నుండి పార్లమెంటు నుండి , గల్లీ నుండి ఢిల్లీ వరకూ తాము ఒకే మాట మీద నిలబడిందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించినట్టు , తెలంగాణ అభివృద్ధిలోనూ ముందుంటామని అన్నారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ ప్రభుత్వాల వైఫల్యాలను గ్రామాల్లో ఎండగడతామని అన్నారు. తెలంగాణలో మార్పు బీజేపీతోనే సాధ్యమని, వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి ఆశించిన ఫలితాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
స్వామి చేరికపై స్వాగతం
స్వామి పరిపూర్ణానంద బీజేపీలో చేరడంపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కే లక్ష్మణ్, మాజీ అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, మాజీ ఎమ్మెల్యేలు రామచంద్రారెడ్డి, ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్‌లు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ అధికార ప్రతినిధి కృష్ణసాగరరావు ఒక ప్రకటన విడుదల చేస్తూ స్వామి పరిపూర్ణానంద బీజేపీలో చేరడాన్ని పార్టీ స్వాగతిస్తోందని అన్నారు. ఆధ్యాత్మిక రంగంలో విశేష అనుభవం పేరుప్రఖ్యాతులున్న వారు బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకోవడం గమనార్హమని అన్నారు. వారి చేరిక పార్టీని తెలంగాణలో మరింత బలోపేతం చేసేందుకు దోహదపడుతుందని అన్నారు. స్వామి పరిపూర్ణానంద భేషరతుగా పార్టీలో ఒక కార్యకర్తగా సేవలు అందించేందుకు చేరారని, వారి సేవలు పార్టీకి ఎంతో విలువైనవని అన్నారు.
ధర్మం కోసం పనిచేస్తా: పరిపూర్ణానంద
దేశం కోసం, ధర్మం కోసం 24 గంటలూ పనిచేస్తానని పరిపూర్ణానంద పేర్కొన్నారు. ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ ఆధ్యాత్మిక మార్గంలో త్రికరణ శుద్ధిగా పనిచేసినట్టు పార్టీ విజయం కోసం కూడా అంతే త్రికరణ శుద్ధితో పనిచేస్తానని చెప్పారు. తనకు ముందూ వెనుక ఎవరూ లేరని, దేశంలో ఎక్కడ అవసరమైతే అక్కడ పనిచేయడానికి తాను సిద్ధమని అన్నారు.