తెలంగాణ

టీఆర్‌ఎస్‌కు ప్రజలు చుక్కలు చూపిస్తారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 19: రానున్న ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్‌కు చుక్కలు చూపిస్తారని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ పేర్కొన్నారు. పటాన్‌చెర్వు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ వేలాది మంది అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రమణ పార్టీ కండువా కప్పి నందీశ్వర్ గౌడ్‌ను స్వాగతించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల గారడీని ప్రజలు అర్ధం చేసుకున్నారని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను టీఆర్‌ఎస్ నేతలు మరచిపోయారని విమర్శించారు. ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చలేదని అన్నారు. కేసీఆర్ కుటుంబ పాలన నుండి రాష్ట్రానికి విముక్తి కల్పించాలని ప్రజలను కోరారు. తెలంగాణ అసెంబ్లీపై మహాకూటమి జెండా ఎగురవేయాలని చంద్రబాబునాయుడు చెప్పారని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో తెలంగాణ పేద బిడ్డలు, అమరుల ఆత్మలు క్షోభిస్తున్నాయని అన్నారు. సెప్టెంబర్ 6న టీఆర్‌ఎస్ అభ్యర్ధుల జాబితాను కేసీఆర్ ప్రకటించారని, ఒంటరిగా ఎన్నికలకు పోతున్నామని గొప్పలు చెప్పారని గుర్తుచేశారు. ఒంటరిగా ఎన్నికలకు కాదని, ఉస్మానియా క్యాంపస్‌కు వెళ్లాలని తాము సవాలు చేశామని అన్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్ధులు గ్రామాలకు వెళ్తే అక్కడి ప్రజలు తిరస్కరిస్తున్నారని ఎద్దేవా చేశారు. 50 సభలు పెడతామని చెప్పిన కేసీఆర్ నాలుగు సభలకే పరిమితం అయ్యారని పేర్కొన్నారు. మహాకూటమి అధికారంలోకి వస్తే రెండు లక్షల రూపాయిల మేర రైతు రుణాలను మాఫీ చేస్తుందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ప్రగతి భవన్‌ను ఖాళీ చేయిస్తామని, దానిని ప్రజలకు మంచి ఆస్పత్రిగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నందీశ్వర్‌గౌడ్ మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్‌పై ప్రమాణం చేసి తాను పార్టీలో చేరానని, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఓటమి భయంతోనే చంద్రబాబుపై కేసీఆర్ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కూటమిలో భాగంగా పటాన్‌చెర్వు టిక్కెట్ ఎవరికి ఇచ్చినా, తాను వారి గెలుపు కోసం కృషి చేస్తానని అన్నారు. జైలుశిక్ష పడిన వారికి సైతం కేసీఆర్ టిక్కెట్‌లు ఇవ్వడంలో అర్థం ఏమిటని నిలదీళశారు. అనంతరం ఆయన తిత్లీ తుఫాను బాధితులకు ఐదు లక్షల రూపాయిల విరాళం అందజేశారు.