తెలంగాణ

మోదీ పాలన అగమ్యగోచరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/రాజేంద్రనగర్, అక్టోబర్ 19: ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశం అగమ్యగోచరంగా మారిందని ఏఐసీసీ నాయకుడు, మాజీ ఎంపీ వీ. హనుమంత రావువిమర్శించారు. దేశంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ దోచుకుంటున్నారని ఆరోపించారు. శుక్రవారం ఇందిరా విజయయాత్ర రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ దుర్గానగర్ మీదుగా చాంద్రాయణగుట్ట వైపుసాగింది. ఈ రథయాత్రలో కాంగ్రెస్ నాయకుడు, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం ఇంచార్జ్ కార్తీక్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. రోడ్‌షోలో వీహెచ్ ప్రసంగిస్తూ కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ అధికారం చేపట్టిన తర్వాత అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. తెలంగాణలో కేసీఆర్ వచ్చాక రాష్ట్రం అధోగతి పాలైందన్నారు. ఇచ్చిన హామీలకు, చేస్తున్న పనులకు సంబంధం లేకుండా పోయిందని వీహెచ్ వాపోయారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను కేసీఆర్ కాపీ కొట్టారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు, కాంగ్రెస్ పోరాటం వల్ల తెలంగాణ ఆవిర్భవిస్తే దాన్ని కేసీఆర్ తన క్రెడిట్‌గా చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. విద్యార్థుల ఆత్మబలిదానాలకు కరిగిన సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్రం ఏర్పాటు కాగానే కేసీఆర్ తన కుటుంబంతో కలిసి సోనియాగాంధీ నివాసానికి వెళ్లి కాళ్లు మొక్కలేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు సామ రాజ్‌పాల్‌రెడ్డి, సదాలక్ష్మి, ఈఎన్ అశోక్, ఇంద్రపాల్‌రెడ్డి, డి.రమేష్ ముదిరాజ్, పచ్చ శ్రీనివాస్, రాజేష్‌షిండే, రాజేష్ నాయుడు, సురేష్ ముదిరాజ్, బాల్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.