తెలంగాణ

కాంగ్రెస్‌లో చేరండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 19: బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్యను కాంగ్రెస్‌లో చేరాల్సిందిగా ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కే. జానారెడ్డి ఆహ్వానించారు. దీనిపై కృష్ణయ్య స్పందిస్తూ బీసీల సంక్షేమం కోసం పోరాడుతున్న తమ సంఘాన్ని మహాకూటమితో జత కట్టి, కూటమి విజయం కోసం కృషి చేస్తానని చెప్పినట్లు సమాచారం. అయితే మహాకూటమిలోని భాగస్వామ్య పార్టీలన్నీ బీసీలకు పెద్ద పీట వేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌లో చేరడానికి ఉన్న అభ్యంతరాలు ఏమిటని జానారెడ్డి ప్రశ్నించగా, ఇప్పటికిప్పుడే తాను సమాధానం చెప్పలేనని, బీసీ సంఘాలతో మాట్లాడిన తర్వాతే చెబుతానని కృష్ణయ్య అన్నట్లు తెలిసింది.
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సూచన మేరకే కృష్ణయ్యను పీసీసీ చర్చలకు ఆహ్వానించింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఈ బాధ్యతను జానారెడ్డికి అప్పగించారు. కాగా, కాంగ్రెస్‌లో చేరితే తన ఒక్కరికే సీటు లభిస్తుందని, తనను నమ్ముకుని ఉన్న వారికి రాజకీయ అవకాశాలు కల్పించడం సాధ్యం కాదేమోనన్న అనుమానంతో కృష్ణయ్య ఆలోచిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌లో చేరకుండా కూటమిలో చేరి, బీసీలకు, తనను నమ్ముకుని ఉన్న వారికీ సీట్లు ఇప్పించుకోవడానికి అవకాశం ఉంటుందని కృష్ణయ్య భావిస్తున్నారు. ఈ విషయాలపై బీసీ సంక్షేమ సంఘం ముఖ్య నాయకులతో చర్చించిన తర్వాతే ఒక నిర్ణయం తీసుకోవాలని ఆయన ఆలోచిస్తున్నారు. ఇలాఉండగా కృష్ణయ్య జానారెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఎన్నికల్లో 50 శాతం సీట్లను బీసీలకు కేటాయించాలని ఆయన డిమాండ్ చేవారు.
బీసీల విద్యా, ఉద్యోగాల రిజర్వేషన్లను 25 నుంచి 50 శాతానికి పెంచాలని, బీసీ విద్యార్థులకు ర్యాంకులతో సంబంధం లేకుండా పూర్తీ ఫీజు రీయంబర్స్‌మెంట్ ఇవ్వాలని, బీసీల విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లపై ఉన్న క్రిమిలేయర్‌ను తొలగించాలని, బీసీలకు పారిశ్రామిక పాలసీలో 50 శాతం కోటా ఇవ్వాలని, బీసీ జాబితా నుంచి తొలగించిన 26 కులాలను వెంటనే బీసీ జాబితాలో చేర్చాలని తదితర మొత్తం 22 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.