తెలంగాణ

నేడు బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

*అభ్యర్ధులపై ఎన్నికల కమిటీ సుదీర్ఘ మంతనాలు
హైదరాబాద్, అక్టోబర్ 19: తెలంగాణ ముందస్తు ఎన్నికల సమరభేరి సంఖారావానికి బీజేపీ ఉరుకులు పెడుతోంది. ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాల్లోని 35 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను దాదాపు ఖరారు చేశారు. 25 నియోజకవర్గాల అభ్యర్థులపై ఇప్పటికే దాదాపు ఆరుమార్లు వడపోత జరిగింది. అనంతరం 25 మంది అభ్యర్ధుల జాబితాను ఖరారు చేశారు. మొత్తం 119 నియోజకవర్గాల్లోనూ పోటీ చేస్తామని తొలి నుండీ బీజేపీ చెబుతోంది. అందులో తొలి జాబితాలో 35 మంది అభ్యర్ధులను ప్రకటిస్తే, ఒకటి రెండు రోజుల్లో మరో పాతిక మంది పేర్లను ప్రకటించనున్నట్టు తెలిసింది. మూడో విడత 35 మంది పేర్లు చివరి విడతలో మిగిలిన పేర్లు ప్రకటించనున్నారు.
గత మూడు రోజులుగా హైదరాబాద్‌లో జాతీయ ప్రధానకార్యదర్శి పి మురళీధరరావు తదితర నేతల సమక్షంలో ‘వార్‌రూమ్’ చర్చలు జరిగాయి. అందరి అభిప్రాయాలతో 35 మంది జాబితాను తీసుకుని రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆయన వెంట జీ కిషన్‌రెడ్డి, జాతీయ ప్రధానకార్యదర్ళి మురళీధరరావు, పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి కృష్ణదాస కూడా ఢిల్లీకి వెళ్తారు. ఈ జాబితాను ఢిల్లీలో శనివారం నాడు పార్టీ పార్లమెంటరీ బోర్డు ఆమోదించిన తర్వాత అధికారక ప్రకటన జారీ అవుతుంది. రాష్టస్థ్రాయిలో డాక్టర్ కే లక్ష్మణ్ అధ్యక్షతన ఏర్పాటైన ఎన్నికల కమిటీ ప్రతి నియోజకవర్గానికి వచ్చిన పేర్లను క్షుణ్ణంగా పరిశీలించింది. ఈ కమిటీలో పి మురళీధరరావు, బండారు దత్తాత్రేయ, పేరాల శేఖర్‌రావు, జీ కిషన్‌రెడ్డి, ఎన్ రామచందర్‌రావు, ఎన్ ఇంద్రసేనారెడ్డి, జీ రామకృష్ణారెడ్డి, బద్దం బాల్‌రెడ్డి, ఇ లక్ష్మీనారాయణ, మంత్రి శ్రీనివాసులు, చింతా సాంబమూర్తి, నాగూరావు నామాజీ, ఆకుల విజయ, చందా లింగన్న దొర ఉన్నారు. వీరంతా ఒక్కో నియోజకవర్గానికి వచ్చిన దరఖాస్తులు, గతంలో పోటీ చేసిన అభ్యర్ధులు, వారికి వచ్చిన ఓట్లు, స్థానికంగా మిగిలిన పార్టీలకు వచ్చిన ఓట్లు, బలాబలాలను అధ్యయనం చేశాయి.
ఇంత వరకూ వివిధ నియోజకవర్గాలకు
ఖరారైన పేర్ల జాబితా...
1. ముషీరాబాద్- డాక్టర్ కే లక్ష్మణ్, 2. అంబర్‌పేట- జీ కిషన్‌రెడ్డి, 3. ఉప్పల్ - ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, 4. గోశామహల్- టి రాజాసింగ్, 5. ఎల్‌బీ నగర్- పేరాల శేఖర్‌రావు, 6. ఖైరతాబాద్ - చింతల రామచంద్రారెడ్డి, 7. ఆదిలాబాద్- పాయల్ శంకర్, 8. ముధోల్- డాక్టర్ రమాదేవి, 9. కరీంనగర్ - బండి సంజయ్, 10. పెద్దపల్లి - గుజ్జుల రామకృష్ణారెడ్డి, 11. సూర్యాపేట - సంకినేని వెంకటేశ్వరారావు, 12. మునుగోడు- మనోహర్‌రెడ్డి, 13. కల్వకుర్తి- తల్లోజు ఆచారి, 14. నారాయణపేట- రతంగ్‌పాండురెడ్డి, 15. భూపాలపల్లి - చందుపట్ల కీర్తిరెడ్డి, 16. నిజామాబాద్- ఎండల లక్ష్మీనారాయణ, 17. ఆర్మూర్- వినయ్‌రెడ్డి, 18.కామారెడ్డి- వెంకటరమణారెడ్డి, 19. దుబ్బాక- రఘునందన్‌రావు ఉన్నారు.
నేడు పార్లమెంటరీ బోర్డు సమావేశం
పార్లమెంటరీ బోర్డు సమావేశం శనివారం నాడు న్యూఢిల్లీలో భేటీ కానుంది. ఈ భేటీలో తెలంగాణ రాష్ట్ర అభ్యర్ధుల జాబితాను పరిశీలించి, అభ్యర్ధులను ఖరారు చేయనున్నారు. అనంతరం అధికారిక ప్రకటన వెలువడనుంది. మిగిలిన అభ్యర్ధులపైనా అధ్యయనం కొనసాగుతుంది.