తెలంగాణ

సేవాదళ్ అంటే చిన్న చూపా..!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 23: కాంగ్రెస్‌కు అనుబంధ విభాగమైన రాష్ట్ర సేవాదళ్ చైర్మన్, జాతీయ సేవాదళ్ కోశాధికారి, మాజీ ఎమ్మెల్సీ కనుకుల జనార్ధన్ రెడ్డికి కోపం వచ్చింది. సేవాదళ్ అంటే అంత చిన్న చూపా..!? అని ప్రశ్నించారు. అన్ని కార్యక్రమాల్లో ముందుండే సేవాదళ్‌కు ఈ ఎన్నికల్లో సీట్ల కేటాయింపు విషయంలో స్పష్టత ఇవ్వడం లేదని ఆయన మంగళవారం విలేఖరుల సమావేశంలో అన్నారు. తాను పార్టీని విమర్శించడం లేదని, తమకు మూడు అసెంబ్లీ స్థానాలు కావాలని కోరుతున్నామని ఆయన తెలిపారు. ముషీరాబాద్, దేవరకద్ర, నిర్మల్ అసెంబ్లీ సీట్లు తమకు కేటాయించాలని పార్టీ రాష్ట్ర నాయకత్వానికి, అధిష్టానికి ఇదివరకే కోరామని ఆయన చెప్పారు. ముషీరాబాద్ సీటు తనకు కేటాయించాలని, దేవరకద్ర సీటు ప్రదీప్ గౌడ్‌కు, నిర్మల్ స్థానాన్ని రాజేశ్వర్‌కు కేటాయించాలని కోరినట్లు ఆయన తెలిపారు. కూకట్‌పల్లి తదితర స్థానాల్లో సేవాదళ్ నాయకులు బలంగా ఉన్నప్పటికీ ఎక్కువ సీట్లు కోరితే బాగుండదన్న అభిప్రాయంతో తమకు తాముగా కుదించుకున్నామన్నారు. సేవాదళ్ తరపున మూడు స్థానాలు లభిస్తే మాకు సీట్లు వచ్చినట్లే సంతోషిస్తామని మిగతా జిల్లాల సేవాదళ్ నాయకులు పెద్ద మనసు చేసుకుని అన్నారని ఆయన తెలిపారు. గతంలో కూడా ఎన్నికల్లో సేవాదళ్‌కు గుర్తింపునివ్వలేదని ఆయన చెప్పారు. అయినా ఏనాడూ సేవాదళ్ నాయకులు, కార్యకర్తలు అసంతృప్తి చెందకుండా పార్టీ కోసమే అంకితమైన భావంతో పని చేస్తున్నారని కనుకుల వివరించారు.

జాప్యం చేయడం బాగుండదు..
మహా(ప్రజా)కూటమితో సీట్ల సర్దుబాటు విషయంలో ఎనలేని జాప్యం చేయడం తగదన్నారు. ఇలా జాప్యం చేయడం వల్ల అభ్యర్థులు ఎవరో అనే స్పష్టత లేక కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారని ఆయన తెలిపారు. సెప్టెంబర్ 6న టీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటిస్తే, తమ పార్టీ జాప్యం చేస్తున్నదన్నారు. ప్రజాకూటమి ఏర్పాటు కావడాన్ని తాము స్వాగతిస్తున్నామని, అయితే సీట్ల సర్దుబాటు త్వరగా తేల్చాలన్నదే తమ అభిమతమని కనుకుల వివరించారు.

70కి పైగా స్థానాల్లో..
ముందస్తు ఎన్నికల్లో 70కి పైగా స్థానాల్లో ప్రజాకూటమి విజయం సాధిస్తుందని ఆయన తెలిపారు. ఇటీవల తమ సేవాదళ్ కార్యకర్తలు సర్వే నిర్వహించారని, ఇందులో 70కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందుతారని తేలిందని కనుకుల వివరించారు. కాబట్టి పార్టీ నాయకత్వం ఇక ఏ మాత్రం జాప్యం చేయకుండా సీట్ల సర్దుబాటు చేసుకుని, ప్రచారంలో దూసుకెళ్ళాలని కనుకుల అభిప్రాయపడ్డారు.