తెలంగాణ

టీఆర్‌ఎస్‌కే సంచార జాతుల మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 23: వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి రాష్ట్ర సంచార జాతుల సంఘం మద్దతు ప్రకటించింది. సంచార జాతుల సంక్షేమాన్ని గతంలో ఏ ప్రభుత్వం పట్టించుకోకున్నా, టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే తమకు మేలు చేసిందని సంచార జాతుల సంఘం స్పష్టం చేసింది. తమ జాతుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న చర్యలకు కృతజ్ఞతగా వచ్చే ఎన్నికల్లో తామంతా టీఆర్‌ఎస్‌కు అండగా ఉంటామని సంచార జాతుల సంఘం హామీ ఇచ్చింది. తెలంగాణ సంచార జాతుల సంఘం ప్రతినిధి బృందం మంగళవారం హైదరాబాద్‌లో ఎంపీ కవితను కలిసి టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తోన్నట్టు ప్రకటించింది. అత్యంత వెనుకబడిన తరగతుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత టీఆర్‌ఎస్స్‌దేనని వారన్నారు. సంచార జాతుల ఆత్మగౌరవం కోసం హైదరాబాద్ ఉప్పల్ భగాయత్‌లో సంచార భవన్ నిర్మాణం కోసం 10 ఎకరాలు కేటాయించడంతో రూ. 10 కోట్లు కేటాయించిందని వారు గుర్తు చేసారు. సంచార జాతుల పరిస్థితిని అధ్యయనం చేయడానికి 2015లో కేంద్ర ప్రభుత్వం బిక్కు రాంజీ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేసిందని, అయితే కమిషన్ నివేదిక ఇచ్చినా సిఫారసులను అమలు చేయడం లేదని సంఘం నేతలు ఎంపీ కవిత దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రంపై వత్తిడి కోసం ఒక ప్రతినిధి బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లనున్నట్టు ఎంపీ కవిత హామీ ఇచ్చారు. ఎంబిసి కార్పొరేషన్ నుంచి పొందిన రుణాలు మాఫీ చేయాలని, గురుకుల విద్యాలయాల్లో ప్రవేశ పరీక్షలకు మినహాయింపు ఇచ్చి నేరుగా సీట్లు ఇవ్వాలని కోరుతూ సంఘం ప్రతినిధులు ఈ సందర్భంగా వినతి పత్రం సమర్పించారు.