తెలంగాణ

ఐటీ విచారణకు రేవంత్ డుమ్మా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 23: ఆదాయపన్ను అధికారుల(ఐటీ) విచారణకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హాజరుకాలేదు. తన వద్ద ఉన్న ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను అడిగారని వాటిని అనుచరుడి ద్వారా పంపినట్టు రేవంత్ వెల్లడించారు. వాస్తవానికి మంగళవారం ఐటీ అధికారుల విచారణకు ఆయన హాజరుకావల్సి ఉంది. ఆస్తులకు సంబంధించన పత్రాలను పంపిస్తే వాటిని పరిశీలించిన తరువాత సమాచారం అందిస్తామని ఐటీ అధికారుల రేవంత్‌కు తెలిపారు. ఇలా ఉండగా రేవంత్‌రెడ్డితో పాటు పద్మనాభరెడ్డి, ఉదయసింహా ఐటీ అధికారుల విచారణకు హాజరుకావల్సి ఉండగా డుమ్మా కొట్టారు. శ్రీసాయి వౌర్య సంస్థకు సంబంధించిన ఆస్తులపై గతంలో ఐటీ అధికారులు విచారించారు. వౌర్య సంస్థకు ఇంకా ఏమైనా అనుబంధ సంస్థలున్నాయా అన్న కోణంలో విచారణ జరుగుతోంది.

సీట్ల సర్దుబాటుకు ఇంకా రెండు, మూడు రోజులు
* మీడియాతో ఉత్తమ్
హైదరాబాద్, అక్టోబర్ 23: ప్రజాకూటమితో సీట్ల సర్దుబాటుకు మరో రెండు, మూడు రోజులు పడుతుందని టీ.పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. పొత్తుల పేచీ విషయంలో ఏఐసీసీ ముఖ్య నాయకులతో వార్ రూంలో చర్చలు జరిపి మంగళవారం హైదరాబాద్‌కు వచ్చిన ఉత్తమ్ కొంత సేపు మీడియాతో మాట్లాడారు. సీట్ల సర్దుబాటులో జరుగుతున్న జాప్యం గురించి ప్రశ్నించగా, నాలుగు పార్టీల నేతలతో మాట్లాడాలి కదా? కొంత సమయం పడుతుందన్నారు. మరో రెండు మూడు రోజుల్లో స్పష్టత వస్తుందని ఆయన తెలిపారు. చర్చలు చాలా బాగా జరుగుతున్నాయని, కూటమి నుంచి ఏ పార్టీ వైదొలగదని ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా అన్నారు. ఇలాఉండగా రాత్రి 7 గంటలకు ఉత్తమ్‌కుమార్ రెడ్డి గోల్కండ హోటల్‌లో పార్టీ ముఖ్యులతో సమావేశమై పొత్తుల అంశంపై చర్చించారు. సర్దుబాటులో ఏయే సీట్లు మిత్రపక్షాలకు ఇవ్వాల్సి ఉంటుందన్న అంశంపై చర్చించారు. ఏఐసీసీ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్తచరణ్ దాస్, సభ్యులు షర్మి

30 నుండి ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత మహాసభలు
హైదరాబాద్, అక్టోబర్ 23: భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీ నుండి నవంబర్ 2వ తేదీ వరకూ హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో 16వ అఖిల భారత మహాసభలు నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర అధ్యక్ష ,కార్యదర్శులు మాదం తిరుపతి, కోట రమేష్‌లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి విద్యార్ధి వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ విద్యార్ధులను విద్యకు దూరం చేస్తున్నారని వారు మండిపడ్డారు. యూనివర్శిటీలో విద్యార్థులకు ఫెలొషిప్ రద్దు చేసి ఉన్నత విద్యకు దూరం చేస్తోందని వారు మండిపడ్డారు. యూనివర్శిటీలో అప్రజాస్వామిక విధానాలను అవలంభిస్తూ వాటిని ప్రోత్సహిస్తుందని యూనివర్శిటీల స్వేచ్ఛను హరిస్తుందని దాడులను, గొడవలను కేంద్ర ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని, యూనివర్శిటీల స్వేచ్ఛను హరించి వేస్తోందని వారు ఆరొపించారు. ఎంతో పేరున్న యూజీసీని రద్దు చేసి హేచ్‌ఈసీఐ తీసుకురావాలని ప్రయత్నించడం దారుణమని పేర్కొన్నారు. ఈ మహాసభల్లో దేశవ్యాప్తంగా 1500 మంది ప్రతినిధులు హాజరవుతారని, తెలంగాణ నుండి 150 మంది హాజరవుతారని చెప్పారు. ఈ మహాసభల్లో దేశవ్యాప్తంగా వస్తున్న విద్యారంగ మార్పులపై వివిధ రాష్ట్రాల్లో విద్యా విధానాలను చర్చించి భవిష్యత్ పోరాటాలకు మహాసభలు దోహపడతాయన్నారు.