తెలంగాణ

26 నుండి బీజేవైఎం జాతీయ సమ్మేళనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 23: దేశం కోసం యువతను సిద్ధం చేసే లక్ష్యంతో ఈ నెల 26 నుండి బీజేవైఎం జాతీయ సమ్మేళనాన్ని హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్నారు. విజయ్‌లక్ష్య- అటల్ యువ మహాధివేషన్ పేరిట దీనిని నిర్వహిస్తున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి ఈ సమ్మేళనానికి 72వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. మొట్టమొదటిసారి సమ్మేళనం రిజిస్ట్రేషన్ మొదలు చివరి రోజు వరకూ అన్ని కార్యకలాపాలూ డిజిటల్ రూపంలోనే నిర్వహించనున్నారు. ప్రారంభ కార్యక్రమం 26వ తేదీ సాయంత్రం జరుగుతుంది. దీనికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరవుతారు. 27వ తేదీ , 28వ తేదీ రెండు రోజుల పాటు అనేక అంశాలపై సదస్సులో విస్తృతంగా చర్చిస్తారు. అనంతరం ఒక రాజకీయ తీర్మానం చేస్తారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తిరిగి బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు బీజేవైఎం సభ్యులు తమ బాధ్యతలను విశదీకరిస్తారు. పలు దేశాల రాయబారులు, సీనియర్ అధికారులు సైతం దీనికి హాజరవుతారు. మహిళలు సైతం పెద్ద సంఖ్యలో హాజరయ్యేలా నిర్వాహకులు చర్యలు తీసుకున్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో ప్రతి సభ్యుడికి క్యూఆర్ కార్డు ఇస్తారు. బార్ కోడ్‌ను రీడ్ చేయగానే ఆయా అభ్యర్ధులకు కల్పించిన సదుపాయాలు, ఎక్కడెక్కడ ఏ ఏ సమావేశం జరగబోతోందో, సభల వివరాలు, బస ఏర్పాట్లు, భోజన ఏర్పాట్లు, కూర్చోవలసిన ప్రదేశం తదితర సమాచారాన్ని వారికి ఎస్‌ఎంఎస్ రూపంలో చేరవేస్తారు. కమిటీలు తమ నివేదికలను సమర్పిస్తాయి. విశ్వవ్యాప్తంగా భారత్‌ను శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దేక్రమంలో యువతకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా బీజేవైఎం ఈ సదస్సును నిర్వహిస్తోంది. దీనికి బీజేవైఎం జాతీయ అధ్యక్షురాలు పూనం మహాజన్, ఉపాధ్యక్షులు రాహుల్ కొఠారి, మధుకేశ్వర్ దేశాయ్, హర్ష సంఘ్వి, ఏపీ మురుగానందం, సౌరభ్ చౌదరి, అభిజిత్ మిశ్రా, సెక్రటరీలు దత్తాత్రేయ పాటిల్, మహిపాల్ రెడ్డి, సౌరవ్ సిక్దర్, దేవంగ్ దవే, కపిల్ పర్మార్, రోహిత్ చాహల్ తదితరులు పాల్గొంటున్నారు.