తెలంగాణ

బీఎల్‌ఎఫ్‌తోనే పేదల రాజ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, నవంబర్ 9: పేదల రాజ్యం రావాలంటే బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అధికారంలోకి రావాలని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీఎల్‌ఎఫ్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని బీఎల్‌ఎఫ్ రాష్ట్ర కన్వీనర్, సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మానుకోటలో శుక్రవారం జరిగిన బహిరంగ సభలో బానోత్ మోహన్‌లాల్ పెద్దసంఖ్యలో కార్యకర్తలు, నాయకులతో కలసి బీఎల్‌ఎఫ్‌లో చేరారు. రాష్ట్ర కన్వీనర్ తమ్మినేని వీరభద్రం వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. బీఎల్‌ఎఫ్ తరుపున మానుకోట అసెంబ్లీ అభ్యర్థిగా బానోత్ మోహన్‌లాల్ పోటీ చేస్తారని ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో మోహన్‌లాల్‌ను గెలిపించుకోవాలని కోరారు. రాష్ట్రంలో గెలిచే సీట్ల జాబితాలో మహబూబాబాద్ ప్రముఖమైందన్నారు. మోహన్‌లాల్ చేరికతో బీఎల్‌ఎఫ్ విజయం దాదాపుగా ఖరారైనట్లే అని తమ్మినేని ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను తీవ్రంగా మోసం చేశాయని విమర్శించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెరాస నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలు ఇస్తామని మాట ఇచ్చి మోసం చేసిందని అన్నారు. బీఎల్‌ఎఫ్ అధికారంలోకి వస్తే మూడున్నర లక్షల ఉద్యోగాలను ఇస్తుందన్నారు. కేంద్రప్రభుత్వం బయ్యారం ఉక్కుపరిశ్రమ అంశంలో ఈ ప్రాంత ప్రజలను నమ్మించి మోసం చేసిందన్నారు. బయ్యారంలో ఉక్కుపరిశ్రమ స్థాపిస్తే ఈ ప్రాంత ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగు అవుతాయని, బీఎల్‌ఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేయడం జరిగిందని గుర్తుచేశారు. బీఎల్‌ఎఫ్ అధికారంలోకి వస్తే తొలి ప్రాధాన్యతగా బయ్యారం ఉక్కుపరిశ్రమ స్థాపిస్తామని తమ్మినేని వీరభద్రం అన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాల్సిన అవసరం ప్రభుత్వంపైనే ఉందన్నారు. పండిన పంటకు కచ్చితంగా గిట్టుబాటు ధర అందిస్తామని, రూ.5కే అన్ని పల్లెల్లో పేదలకు భోజనం అందిస్తామని, గుడిసెలకు ఉచిత విద్యుత్ సరఫరా అందజేస్తామని తమ్మినేని తెలిపారు. మహబూబాబాద్ నియోజకవర్గంలో బీఎల్‌ఎఫ్ బలమైన శక్తిగా ఉందని దీన్ని మరింత బలోపేతం చేయడం కోసం అన్ని సామాజిక, రాజకీయ వర్గాలు కలసి రావాలని తమ్మినేని వీరభద్రం కోరారు. బీఎల్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సూర్యప్రకాష్‌రావు, నాయకులు సుదర్శన్, శ్రీనివాస్, సూర్నపు సోమయ్య, ఆకుల రాజు పాల్గొన్నారు.