తెలంగాణ

కేసీఆర్‌తోనే స్వయం పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, నవంబర్ 9: టీఆర్‌ఎస్ అంటేనే సంక్షేమమని.. మహాకూటమి అంటేనే సంకీర్ణం.. సంక్షోభమని.. ప్రజలు సంక్షేమం వైపు ఉంటారో.. సంక్షోభం వైపు ఆలోచించుకోవాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రమైన సిద్దిపేటలో ముదిరాజ్‌లో ఆత్మీయ సమ్మేళన భారీ మహాసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. టీఆర్‌ఎస్ సర్కార్ 40 వేల కోట్లతో సంక్షేమ పథకాలు అమలు చేస్తు దేశంలో నెంబర్‌వన్‌గా నిలిచిందన్నారు. కేసీఆర్ పాలనలో అడుగడుగునా అభివృద్ధి, సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల అభివృద్ధికి కృషిచేస్తున్నట్లు పేర్కొన్నారు. కూటమి అంటేనే సంకీర్ణమని.. సంక్షోభమని రెండు రోజుల్లో నామినేషన్లు ప్రక్రియ ప్రారంభమైందని, ఇంతవరకు మహాకూటమి నేతలు టికెట్ల కోసం కుమ్ములాడుకుంటున్నారన్నారు. కూటమి నేతలు ఢిల్లీకి చుట్టు తిరిగి రాహుల్‌గాంధీ ముందు చేతులు కట్టుకున్నారన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఆంధ్రబాబును నమ్ముకున్నారని విమర్శించారు. ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి చివరి నిమిషం వరకు చంద్రబాబు అడుగడుగున అడ్డు పడ్డారన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక సైతం ఈనాడు అభివృద్ధిని అడ్డుకుంటున్న చంద్రబాబు తెలంగాణ ద్రోహి అని విమర్శించారు. కేసీఆర్ స్వయం పాలన కావాలా..? చంద్రబాబు పరాయి పాలన కావాలా అని? ప్రజలే నిర్ణయం తీసుకోవాలన్నారు. తెలంగాణ ప్రజలను బీజేపీ పార్టీ మోదీ సర్కార్ పట్టించుకోలేదన్నారు. కేంద్రంలో ప్రత్యేకంగా బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని మోదీ సర్కార్ దృష్టికి పలుమార్లు తీసుకెళ్లిన పట్టించుకోలేదని విమర్శించారు. తెలంగాణకు అన్యాయం చేసి, అర్థరాత్రి 7 మండలాలను ఆంధ్రాలో కలిపింది బీజేపీ సర్కార్ అని దుయ్యపట్టారు. మోదీ సర్కార్ నోట్ల రద్దుతో ప్రజలపై రోడ్ల పాలు చేసిందన్నారు. చమురు ధరలు, నిత్యావసర ధరలను అరికట్టడంతో మోదీ సర్కార్ విఫలమైందని ఆరోపించారు. ప్రధాని మోదీ సూటు, బూటుతో విహార యాత్రలే తప్పా పేద ప్రజలకు చేసింది ఏమిలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ అభివృద్ధిబాటలో ముందుకు సాగాలంటే రాష్ట్రంలో అధికారంలోకి రావాలన్నారు. కేంద్రలో టీఆర్‌ఎస్ నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలని అప్పుడే అధికంగా అభివృద్ధికి నిధులు సాధించుకోవచ్చన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రెండు దొందూ.. దొందేనని...ఇద్దరూ అవకాశ వాదులని విమర్శించారు. తెలంగాణ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకునే కేసీఆర్ పాలనే శ్రీరామరక్ష అన్నారు. రాష్ట్రంలో విద్యాభివృద్ధికి 540 రెసిడెన్సియల్ స్కూళ్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రైతులకు ఎకరాకు 8వేల పెట్టుబడి సాయం, 5లక్షల బీమా సౌకర్యం కల్పించినట్లు పేర్కొన్నారు. ఎన్నికలప్పుడు వచ్చే పార్టీల నాయకులను ప్రజలు నమ్మిమోసపోవద్దన్నారు. ఉద్యమంలో ఉన్న, అధికారంలో ఉన్న ప్రజల మధ్యనే ఉండి కష్ట,సుఖాల్లో పాలుపంచుకున్నట్లు తెలిపారు. టీఆర్‌ఎస్ పార్టీని ఆశీర్వదించేందుకు కుటుంబ సమేతంగా వేలాదిగా తరలివచ్చిన ముదిరాజ్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఏమిచ్చిన మీరుణం తీర్చుకోలేనని, పెద్దమ్మ తల్లి దీవేనతో బ్రతికున్నంతవరకు సేవా చేసి రుణం తీర్చుకుంటానన్నారు. పోలీంగ్ శాతం పెంచేందుకు కృషిచేయాలని, ప్రతి గ్రామంలో 99 శాతం పోలింగ్ జరగాలన్నారు. నెల రోజులు కష్టపడితే...ఐదేండ్లు కష్టపడి మీకు సేవా చేసి రుణం తీర్చుకుంటానన్నారు.
రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు శరవేగంతో ప్రాజెక్టులు నిర్మిస్తున్నట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. మత్య్యకారుల అభివృద్ధికి కృషిచేసిన టీఆర్‌ఎస్‌కు అండగా నిలువాలని సూచించారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, ముదిరాజ్ సంఘం నేతలు బాలరంగం, శంకర్‌ముదిరాజ్, మల్యాల బాలరాజు తదితరులు పాల్గొన్నారు.