తెలంగాణ

ఎస్సీ వర్గీకరణను మేనిఫెస్టోలో చేర్చితే కోర్టు ధిక్కరణ కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 9: ఎస్సీ వర్గీకరణ అంశాన్ని రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో చేర్చితే, అది కొర్టు ధిక్కరణ కిందకు వస్తుందని, చేర్చే పార్టీలపై తాము కేసులు పెడతామని రాష్ట్ర మాలమహానాడు హెచ్చరించింది. శుక్రవారం బషీర్‌బాగ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య మాట్లాడుతూ త్వరలో జరగనున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ (మహాకూటమి) పార్టీలు మాల, మాదిగ సామాజిక వర్గాలకు సమానంగా సీట్లు కేటాయించాలని, ఈ పార్టీలకు మాల, మాదిగలు రెండు కళ్లలాంటి వారని తెలిపారు. అంబేద్కర్ ఆలోచనా విధానానికి, రాజ్యాంగ స్పూర్తికి వ్యతిరేకమైన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశాన్ని రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలో చేర్చరాదని చెన్నయ్య కోరారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రజత్‌కుమార్‌ను కలిసి ఓ వినతిపత్రాన్ని సమర్పించినట్లు ఆయన వెల్లడించారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశాన్ని సుప్రీంకోర్టు ఆదేశానుసారం పార్టీల మేనిఫెస్టోల నుంచి తొలగించాలని వినతి పత్రంలో కోరినట్లు చెన్నయ్య వివరించారు. మాలమహనాడు మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు సరసా దేవి, జాతీయ కార్యనిర్వహక అధ్యక్షుడు టీ.రవి, సంఘం ప్రతినిధులు జంగా శ్రీనివాస్, శ్యాంకుమార్, సాయి పాల్గొన్నారు.