తెలంగాణ

కోదండరాం పార్టీకి అభ్యర్థులు కావలెను!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, నవంబర్ 13: తెలంగాణ జనసమితి కొత్త ఇబ్బందిని ఎదుర్కొంటోంది. టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా మిగితా పార్టీలతో కలిసి కూటమి ఏర్పాటు చేయడంలో కీలకభూమిక పోషించిన కోదండరాం తమ పార్టీకి ఎనిమిది సీట్లు దక్కించుకోవడంలో కూడా అంతే నేర్పును ప్రదర్శించారు. కాని ఆయన ఇక్కడే ప్రస్తుతం కొత్త ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. పార్టీ తరుపున పోటీ చేసేందుకు సరైయిన అభ్యర్థులు లేని విచిత్ర పరిస్థితి పార్టీలో చోటు చేసుకుంది. ప్రొఫెసర్ కోదండరాం, కపిల వాయి దీలిప్‌కుమార్‌లు తప్ప ఇతర నేతలు ఎవ్వరూ పేరున్న నేతలు కాకపోవడం, వాళ్లు ప్రజలకు పరిచయం అయిన వ్యక్తులు కాకపోవడం టీజెఎస్‌కు ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు సీట్లు సాధించిన ఆ పార్టీకి అభ్యర్థులు కరువైయ్యారు. దీంతో తమకు కేటాయించిన వర్ధన్నపేట నియోజకవర్గం నుండి పోటీకి దింపడానికి బీజేపీకి చెందిన ఎన్ ఆర్ ఐని పార్టీలోకి ఆహ్వానించి పోటీకి నిలపాలని ఆలోచన చేయడం పట్ల ఆపార్టీ స్థానిక నేతలు ఆవాక్కవుతున్నారు.
తెలంగాణ కోసం పనిచేసిన వాళ్లను కాదని ఒక పార్టీయేతర సంపన్నుని పోటీకి దించడమేమిటి అని చర్చించుకుంటున్నారు. ఇక కోదండరాం పోటీ చేస్తారా లేదా..? ఒక వేళ పోటీ చేస్తే ఎక్కడి నుంచి పోటీ చేస్తారో అనే విషయంలో ఇంకా ఉత్క్ఠ కొనసాగుతోంది. వరంగల్ తూర్పు, లేదా జనగామ నియోజకవర్గాల్లో ఎదో ఒక దానినుంచి పోటీ చేయమన్నారని ప్రచారం జరుగుతోంది. అందుకే కాంగ్రెస్ పార్టీ ఈ రెండు స్థ్ధానాలకు అభ్యర్థులను ఇంకా ఖరారు చేయలేదు. ఈ రెండు నియోజకవర్గాల్లో కోదండరాం ఏదో ఒకటి ఎంపిక చేసుకున్నట్లు తమకు సమాచారం అందిస్తేనే తాము మిగతా సీట్లకు అభ్యర్థులను ప్రకటిస్తామని అంటునట్లు తెలిసింది. ఈ సందిగ్ధత మూలంగా సీనియర్ నాయకుడు, మాజీ టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు పార్టీ మొదటి జాబితాలో సీటును కేటాయించ లేదు. ఒక సీనియర్‌కు పార్టీ ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ఆయన అభిమానులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక కపిలవాయి దీలీప్‌కుమార్‌కు ఆయన పోటీకి దిగనున్న మలక్‌పేట నియోజకవర్గంలో ఎదురుగాలి వీస్తోంది. ఇప్పటికే ఇక్కడి కార్యకర్తలు తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇక మిగతా సీట్లకు టీజేఎస్ తమ అభ్యర్థులను వెతుకుకోవాల్సి వస్తున్నదని ఆ పార్టీ నేతలే అంటున్నారు. ఇక ఈ పార్టీకి ఎన్నికల కమిషన్ కేటాయించిన గుర్తుకూడా ఒక గుదిబండలా మారబోతున్నదని అంటున్నారు. ఎందుకంటే ఎన్నికలు సమీపించేనాటికి కూడా ఆ పార్టీకి ‘గుర్తు’ రాకపోవడం ఆ పార్టీ అవకాశాలను దెబ్బతీస్తాయని స్ధానిక నాయకులు భయపడుతున్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ టీజేఎస్ అభ్యర్థులను ‘చెయ్యి’ గుర్తుపై పోటీ చేయమని ఒత్తిడి తెస్తోంది. టీజెఎస్ పైకి వద్దని అంటున్నా గుర్తు గుబులు తమ నేతలను వెంటాడుతోందని, రాబోయో రోజుల్లో ఈ దిశగా తమ నాయకుడు ఆలోచించవచ్చునని కార్యకర్తలు అంటున్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ మాత్రం టీజేఎస్ నేతల గెలుపు విషయంలో అనుమానంతో ఉందని, ఆ పార్టీ ప్రకటించే అభ్యర్థులను బట్టి అవసరం అయితే తమ నేతలను పోటీకి దించి ప్రెండ్లీ పోటీ చేయంచాలని యోచిస్తునట్లు తెలుస్తుంది. ఇదే నిజమైతే కాంగ్రెస్-టీజేఎస్ మధ్యన ప్రెండ్లీ పోరు తప్పేటట్లు కనిపించడం లేదు.