తెలంగాణ

గాంధీభవన్‌కు పహిల్వాన్ల రక్షణ సిగ్గుచేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, నవంబర్ 13: సిద్ధాంతం పేరుతో రాద్ధాంతం చేస్తున్న కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, టీజేఎస్, సీపీఐల ఆశలు ఎంతమాత్రం నెరవేరబోవని, అయితే కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం గాంధీభవన్‌కు పహిల్వాన్‌ల రక్షణ ఏర్పాటుతో ఆ పార్టీ ప్రజలను ఎలా కాపాడగలుగుతుందని రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్‌రావు నిలదీశారు. మంగళవారం గజ్వేల్‌లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుండి 500 మంది టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం రెండు నెలలుగా చర్చలు జరిపి ఏడెనిమిది స్థానాలు దక్కించుకోగా, ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు దక్కడం కష్టమేనని, ఆ స్థానాలన్నీ తమ ఖాతాలో జమ చేసుకోనున్నట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో టీఆర్‌ఎస్ సర్కార్ చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలను కేంద్ర సర్కార్‌తోపాటు ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, మంత్రులు, ఉన్నతాధికారులు మెచ్చు కోగా, ఇక్కడి బీజేపీ నేతలు మాత్రం విమర్శలు చేస్తుండడం సిగ్గుచేటని పేర్కొన్నారు. గజ్వేల్‌లో కేసీఆర్ గెలుపు ఎప్పుడో నిర్ణయం కాగా, మెజార్టీ లక్ష లక్ష్యంగా పెట్టుకొని పార్టీ శ్రేణులు శ్రమిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ప్రత్యర్థి ప్రతాప్‌రెడ్డి డిపాజిట్ దక్కించుకుంటే అదే మహా అవుతుందని ఎద్దేవా చేయగా, టీఆర్‌ఎస్ సర్కార్ చేపట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పెద్ద ఎత్తున తమ పార్టీలో చేరుతున్న క్రమంలో పాతకొత్త తేడాలేకుండా వారికి గౌరవం ఇస్తూ కడుపులో పెట్టుకొని కాపాడుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధిని జీర్ణించుకోలేని కాంగ్రెస్ ప్రజల చెవిలో పూలు పెడుతుండగా, కళ్లకు మాత్రం గంతలు కట్టులేరని విమర్శిస్తూ ఎన్నికల పోలింగ్ రోజు కాంగ్రెస్ అభ్యర్థుల చెవుల్లో ప్రజలు పూలు పెట్టడం ఖాయమని అన్నారు. యూనివర్శిటీ స్థాయిలో గజ్వేల్ ఎడ్యుకేషన్ హబ్‌ను తీర్చిదిద్దగా, కార్పొరేట్ తరహాలో ప్రభుత్వ ఆసుపత్రిని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. నాలుగేళ్లలో గజ్వేల్‌ను 4 దశాబ్దాల ముందుంచగా, గత ఎమ్మెల్యేలు చేసిన అభివృద్ధితో పోల్చి చూసుకోవాలని ఆయన కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంట్ కష్టాలు, తాగునీటి ఇబ్బందులు, ఎరువుల కొరతతోపాటు గుండాలు, పహిల్వాన్‌లు, బౌన్సర్ల రాజ్యం వస్తుందని వివరించారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, కార్పొరేషన్ చైర్మెన్‌లు భూపతిరెడ్డి, భూంరెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, మున్సిపల్ చైర్మెన్ భాస్కర్, వైస్ చైర్మెన్ అరుణ భూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యరానాయణ, జెడ్‌పీటీసీలు సింగం సత్తయ్య, వెంకట్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మెన్ వెంకట్‌నర్సింహారెడ్డి, టీఆర్‌ఎస్‌వీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మాదాసు శ్రీనివాస్ పాల్గొన్నారు.