తెలంగాణ

ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ, నవంబర్ 13: రాష్ట్రంలో చెప్పిన మాట ప్రకారం రాష్ట్ర సీఎం కేసీఆర్ ముస్లిం మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించి తీరుతారని రాష్ట్ర ఆపద్ధర్మ ఉపముఖ్యమంత్రి మహ్మద్ మహమూద్ అలీ అన్నారు. మంగళవారం స్థానిక ఏఆర్‌సీ ఫంక్షన్ హాలులో జరిగిన టీఆర్‌ఎస్ మైనార్టీ సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో 50 సంవత్సరాలకు పరిపాలన చేసిందని, దేశంలో గాని, రాష్ట్రంలో రిజర్వేషన్ మాట ఎత్తలేదన్నారు. కేసీఆర్ మాత్రమే రిజర్వేషన్ కల్పించేందుకు ముందుకు వచ్చారన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 240 బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశారని, రానున్న కాలంలో మరో 200 ఏర్పాటు చేస్తారన్నారు. టీఆర్‌ఎస్ అన్ని వర్గాల సంక్షేమం కోరే పార్టీ అని పేర్కొన్నారు. సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నదన్నారు. టీఆర్‌ఎస్ బీజేపీతో కలిసిందని దుష్ప్రచారం జరుగుతుందన్నారు. బీజేపీతో కలిసే ప్రసక్తే లేదన్నారు. మైనార్టీలు 12 శాతం రిజర్వేషన్ పొందాలంటే, ఓవర్సీస్ ఆర్ధిక సహాయం పొందాలంటే సంక్షేమ పథకాలు కొనసాగాలంటే కేసీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రి చేయాలని కోరారు. తెలంగాణను అడ్డుకున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో కాంగ్రెస్ పార్టీ జతకట్టడం తెలంగాణ ప్రజలు ఆమోదించవద్దని, తిప్పి కొట్టాలని రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. చంద్రబాబుతో కలిసి అధికారంలోకి వచ్చే కుట్రలు కాంగ్రెస్ చేస్తున్నదని, ప్రజలు ఓటుతో అడ్డుకోవాలని కోరారు. దేశంలోనే అతి పెద్ద సెక్యులర్ పార్టీ టీఆర్‌ఎస్ అని ఆయన అన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని కలలు కంటున్నారని కల్లలవుతాయని పేర్కొన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడ మైనార్టికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని, ముస్లింలకు జనరల్ కార్పొరేషన్ ఇవ్వలేదని, ఒక్క కేసీఆర్ మాత్రమే మహమూద్ అలీకి, తనకు అవకాశం కల్పించారని రాష్ట్ర ఖాదీ, విలేజ్ ఇండస్ట్రి బోర్డు చైర్మన్ వౌలానా మహ్మద్ యూసుఫ్ జాహెద్ అన్నారు. మిర్యాలగూడ ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నానని, ఈద్గాకై ఏడెకరాల భూమి కేటాయించానని, కోటి రూపాయలతో ఈద్గా నిర్మాణం చేస్తానని టీఆర్‌ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. తనను భారీ మెజారిటీతో గెలిపించి అభివృద్ధి, సంక్షేమ పనులు పూర్తి చేసుకోవాలని కోరారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, చైర్మన్ తిరునగరు నాగలక్ష్మి భార్గవ్, వైస్ చైర్మన్ మగ్ధుంపాషా పాల్గొన్నారు.