తెలంగాణ

అధికారంలోకి వచ్చిన వారంలోపే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిప్పర్తి, నవంబర్ 13: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారంలోనే రైతులకు రెండు లక్షల రుణమాపీ అమలు చేయడం జరుగుతుందని మాజీ మంత్రి పీసీసీ మేనిఫెస్టో కమిటీ కోచైర్మన్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మంగళవారం నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలంలోని దుప్పలపల్లి, రాజుపేట, జొన్నలగడ్డ గూడెం, రాయినిగూడెం, అంతయగూడెం, గంగన్న పాలెం, చిన్నాయిగూడెం, మల్లెపల్లి వారిగూడెంలో గడపగడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అన్ని గ్రామాలలో ప్రజలు కోమటిరెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలంతా కాంగ్రెస్ పార్టీనే అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో కేసీఆర్ అరాచక పాలన సాగిస్తున్నాడని విమర్శించాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ప్రజల బతుకులు మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బతుకమ్మ పండుగకు కోట్లు ఖర్చు చేస్తున్న రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని విమర్శించారు. గత నాలుగు సంవత్సరాలుగా కేసీఆర్ మోసపూరిత మాటలతోనే పాలన సాగించాడని ధ్వజమెత్తారు. ధన బలంతో మరోసారి గద్దెనెక్కాలని చూస్తున్న కేసీఆర్ పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క పేద ప్రజలకు న్యాయం జరగడంలేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని, ఇందిరమ్మ రాజ్యం వస్తుందని చెప్పారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీనీ ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అసిఫ్ ఖాన్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు వంగాల స్వామిగౌడ్, డీసీసీ ఉపాధ్యక్షుడు చింతకుంట్ల రవీందర్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.