తెలంగాణ

అభివృద్ధే నినాదం.....

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, నవంబర్ 13: వ్యూహ ప్రతివ్యూహాల సమరం. ఉద్ధండుల రణక్షేత్రం. ముందస్తులో మునుపెన్నడూ ఎరుగని ప్రాచుర్యం. దేశ, రాష్ట్ర రాజకీయ విశే్లషకుల దృష్టిని ఆకర్షిసోన్న జిల్లా కేంద్రమైన సూర్యాపేటలో కారు స్పీడెంత..! రెండు జాతీయ పార్టీలను ఎదుర్కొంటోన్న ఓ ప్రాంతీయ పార్టీ వ్యూహమేమిటీ..!? చివరాఖరి ఫలితమేమైనా.. ఎన్నికల శంఖారావాన్ని పూరించిన మాజీ ఎమ్మెల్యే మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి వినూత్న వ్యూహంతో ముందస్తుకు సిద్ధమవుతున్నారు. పట్టణ, పల్లె, తండా అన్న తారతమ్యమెరగకుండా గెలుపుకోసం శ్రమిస్తున్నారు. కష్టసుఖాలనెరిగిన తత్వం.. నాలుగున్నర ఏళ్ల అధికార అనుభవాన్ని రంగరించి మరోమారు విజేతగా నిలిచేందుకు పాచికలు కదుపుతున్నారు. అభివృద్ధినే తొలి నినాదంగా ఎంచుకున్న ఆయన హమీల అమలు తీరును శ్రేణులకు నూరిపోస్తూ ఓట్ల వేటకు పురమాయిస్తున్నారు. చేరికలతో బలంగా పురిదాలిచిన గులాబీదండును ప్రయోగించే ఎత్తుగడలకు పదునుపెడుతున్నారు. ఆత్మీయ సమ్మేళనాలు, రచ్చబండ ముచ్చట్లు, పండుగల పలకరింపులతో ఇప్పటికే ఓ దఫా ఓటర్లతో మమేకమైన మంత్రి ప్రత్యర్ధి బలాబలాల బేరీజులో నిమగ్నమయ్యారు. బలమైన ప్రత్యర్ధులు బరిలో ఉండటంతో శస్త్రాలు అవపోషణతో పదునైన అస్త్రాలకు పదును పెడుతున్నారు. జిల్లాలోనే మరెక్కడా లేని విధంగా సూర్యాపేట శాసనసభ స్ధానంలో త్రిముఖ పోటీ అనివార్యమయింది. బలమైన ప్రత్యర్ధులు బరిలో ఉండటంతో బహుముఖ వ్యూహంతో ఎన్నికల గోదాలోకి దిగుతున్నారు. అసంతృప్తి వాసనే ఎరుగని సూర్యాపేట అసెంబ్లీలో మంత్రి రాజకీయ చతురత ప్రత్యర్థులకు సైతం మింగుడుపడని అంశం. జఢత్వానికి ఏమాత్రం అవకాశమివ్వని ఆయన ప్రత్యర్ధి తేరుకోక ముందే పాచికలు కదపడంలో దిట్ట. అందులో భాగంగానే మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బీరవోలు రవీందర్‌రెడ్డి తనయుడు బీరవోలు శ్రీహర్షను పార్టీలోకి ఆహ్వానించడం, గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేసిన శ్రీహర్ష ఐదువేల పైచిలుకు ఓట్లు సాధించారు. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ వెంట యువత పెద్దఎత్తున నడిచివచ్చిన విషయం విదితమే. పాలన పరమైన విధానాల వల్ల తాజా ఎన్నికల్లో యువత ఓట్లుకు కాస్తా గండిపడే అవకాశాన్ని ముందే పసిగట్టిన మంత్రి చాకచక్యంతో శ్రీహర్షను లాగడంలో సఫలమయ్యారు. యువ ఓటర్లు అధికంగా ఉండటం, యూత్‌లో శ్రీహర్షకు అధికంగా ఫాలోయింగ్ ఉండటం మంత్రికి కలిసొచ్చే అంశం. మూసీ మురికి నీటి నుంచి విముక్తి, సిండికేట్ మరకలంటని వ్యాపారాల పురోగతి తన వల్లే సాధ్యమని శాంతి, సుస్థిర పాలన కొనసాగాలంటే, రూ.3650 కోట్ల పనుల పురోగతి పంధాను అదేరీతిన కొనసాగించాలంటే మరోమారు తనను ఆశీర్వదించాలంటూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.