తెలంగాణ

తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థకు ఐసీసీ అవార్డులు: సీఎండీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలను కల్పించడంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అందిస్తున్న సేవలను దృష్టిలో పెట్టుకుని జాతీయ స్థాయిలో అవార్డులు దక్కాయని ఆ సంస్థ సీఎండీ రఘుమారెడ్డి వెల్లడించారు.
దేశ రాజధానిలో ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసిన ఎనర్జీ సమ్మిట్‌లో ఈ అవార్డులు ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. బుధవారం నాడిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ నాణ్యత, సేవలతో పాటు సమర్థవంతమైన పంపిణీ వ్యవస్థను ప్రణాళికా బద్ధంగా అమలు చేయడంతో అధికారుల పాత్ర ప్రశంసనీయమని సమ్మిట్ నిర్వహకులు కొనియాడినట్లు చెప్పారు. సాంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా ఉత్పత్తిని ప్రోత్సహించడం, పునరుద్పాతక విద్యుత్‌ను అనుసంధానించడం వంటి కార్యక్రమాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంతో దేశ వ్యాప్తంగా ప్రథమ స్థానం దక్కిందన్నారు. విద్యుత్ సంస్థలో నూతన టెక్నాలజీని వినియోగించడం జరిగిందన్నారు. ఇంధన సామర్థ్యం పెంచడానికి రూ.2.07 కోట్ల వ్యయంతో 2.78 లక్షల ఎల్‌ఈడీ బల్బులు ఏర్పాటు చేశామన్నారు. సంస్థ ఆధునిక సాంకేతికతను వినియోగించడంతో పంపిణీ నష్టాలను తగ్గించామన్నారు. వ్యవసాయ సర్వీసులు పొందడానికి సులభతరం చేశామని చెప్పారు.
ఈ యేడాది 3.62 లక్షల మందికి విద్యుత్ సర్వీసులు మంజూరు చేశామన్నారు. స్మార్ట్ మీటర్ల పనితీరుపై వినియోగదారులు సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. తమ సంస్థకు ఐసీసీ వంటి ప్రతిష్టాత్మక అవార్డు లభించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అవార్డులు దక్కిన అంశాలను ప్రస్థావిస్తూ ఈవిజయం తమ సంస్థ ఉద్యోగుల కృషికి నిదర్శినమని అన్నారు.