తెలంగాణ

నగదు ఉంటే నేరమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 14 : ఎన్నికల సందర్భంగా పోలీసులు, ఆదాయం పన్ను శాఖ అధికారులు దాడులు చేసి డబ్బు, బంగారం తదితరాలను స్వాధీనం చేసుకుంటున్న కేసుల్లో సామాన్యులే ఇక్కట్లకు గురవుతున్నారు.
2014 ఎన్నికల సందర్భంగా కానీ, ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల సందర్భంగా కానీ ఏ ఒక్క రాజకీయ నాయకుడిపై కేసులు రుజువుకాకపోవడం చర్చనీయాంశం అయింది. తెలంగాణ శాసనసభకు జరుగుతున్న ఎన్నికల సందర్భంగా ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 66.96 కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆరుకోట్ల రూపాయల విలువైన మద్యం, నాలుగున్నర కోట్ల రూపాయల విలువైన బంగారు, వెండి తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వివిధ కేసులకు సంబంధించి 3154 మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసులకు సంబంధించి వివిధ జిల్లాల్లోని కోర్టుల్లో సంబంధిత అధికారులు చార్జీషీటు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇటీవల సూర్యాపేట పోస్టల్ డివిజన్‌కు చెందిన టేకుమట్ల సబ్-పోస్ట్ఫాసు నుండి ఎల్కారం బ్రాంచి పోస్ట్ ఆఫీసుకు పింఛన్లు, మనీ ఆర్డర్లు తదితర అవసరాల కోసం లక్ష రూపాయలు సంబంధిత సిబ్బంది తీసుకువెళుతుండగా పోలీసులు పట్టుకున్నారు. అలాగే వ్యక్తిగత అవసరాల కోసం ఒక వ్యక్తి 20 లక్షల రూపాయల నగదు అప్పు తీసుకుని ట్రెజరీలో కట్టేందుకు హైదరాబాద్ నుండి మహబూబ్‌నగర్ తీసుకువెళుతుండగా పోలీసులు పట్టుకున్నారు. బంగారు, వెండిని వ్యాపారం కోసం తీసుకువెళుతున్న వర్తకుల నుండి ఈ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఇలాగే పెళ్లిల్లు, భూములు, ఇళ్ల కొనుగోళ్లు, అమ్మకాల సందర్భంగా డబ్బు చేతులు మారతాయి. ఆస్తులకొనుగోలు, పెళ్లిళ్లు తదితర పనుల సందర్భంగా ఒకరి వద్ద అప్పు తీసుకుని వెళుతూ ఉంటే దానికి సంబంధించి కాగితాలు ఏమీ ఉండవు. ఇలాంటి కేసులే అధికంగా నమోదవుతున్నాయి. కోర్టుల్లో కేసులు తెమిలేందుకు చాలా కాలం పడుతుందన్నది అందరికీ తెలిసిన బహిరంగ వాస్తవం. పేదలు, సామాన్యుల పరిస్థితి దయనీయంగా ఉంటుంది. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్టు ఎన్నికల సందర్భంగా సామాన్యులకు సరిగ్గా సరిపోలుతుంది. ఎన్నికల సమయంలో వ్యక్తిగత అవసరాల కోసం డబ్బు కానీ బంగారం, వెండి తదితర విలువైన వస్తువులను సామాన్యులు తీసుకువెళ్లలేని పరిస్థితి ఉంది. విధిలేని పరిస్థితిలో తీసుకువెళితే పోలీసులు, ఆదాయం పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు.

గత ఎన్నికల్లో..
2014 ఎన్నికల సమయంలో 103 కోట్లరూపాయలతో పాటు 70 కిలోల బంగారు, 300 కిలోల వెండిని అధికారులు వివిధ వ్యక్తుల నుండి స్వాధీనం చేసుకున్నారు. వీటిలో దాదాపు 50 కోట్ల రూపాయల నగదును తిరిగి సంబంధిత వ్యక్తులకే చెల్లించారని, మిగతా డబ్బు ఎవరిదో తెలియకపోవడం వల్ల కోర్టు ఆదేశాల మేరకు ట్రెజరీలో జమ చేశారు. ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఈ కేసుల్లో నిందితుడిగా శిక్షకు గురికాకపోవడం గమనార్హం.
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తంకుమార్‌రెడ్డి ఉపయోగించినట్టు చెబుతున్న ఒక కారులో కాలిపోయిన నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ప్రచారం జరిగినప్పటికీ, ఈ కేసు ఏమైందో స్పష్టం కాలేదు. మొత్తం మీద ఎన్నికల కమిషన్ పేరుతో నమోదవుతున్న కేసుల వల్ల సామాన్యులే ఇక్కట్లకు గురవుతున్నారని స్పష్టమవుతోంది.