తెలంగాణ

ప్రవేశ పరీక్షలు, ఫీజులపై కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 14: రాష్ట్రంలో ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షలకు ఇప్పటికే తాత్కాలిక షెడ్యూలు రూపొందడంతో ఉన్నత విద్యా మండలి ప్రవేశపరీక్షలు, రానున్న విద్యాసంవత్సరాలకు వృత్తి, సాంకేతిక విద్యాసంస్థల్లో ఫీజులకు సంబంధించిన కసరత్తు ప్రారంభించింది. ప్రవేశపరీక్షలకు ప్రధానంగా జాతీయ ప్రవేశపరీక్షల షెడ్యూలు, ఆంధ్రా, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల ప్రవేశపరీక్షల షెడ్యూళ్లను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఏటా తెలంగాణ షెడ్యూలును రూపొందించేవారు. అయితే వచ్చే ఏడాదికి షెడ్యూలు రూపొందించాలంటే సార్వత్రిక ఎన్నికలను పరిగణనలోకి తీసుకోవల్సి వస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలు తొలి దశలోనూ జరుగుతాయి. తెలంగాణలో ముందు జరిగే అవకాశం ఉంటుంది, ఆ తర్వాతనే ఆంధ్రా, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల ఎన్నికలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో గతంలో మాదిరి ఎన్నికల ప్రక్రియ ఏప్రిల్ చివరి నాటికి పూర్తయితే ప్రవేశపరీక్షలను మే నెలలో నిర్వహించేందుకు ఉన్నత విద్యామండలి సన్నాహాలు చేస్తోంది. గత ఏడాది మే 2 నుండి 7వ తేదీ వరకూ ఎమ్సెట్, నిర్వహించగా, మే 9న ఇసెట్, మే 23,24 తేదీల్లో ఐసెట్, మే 20 నుండి పీఈసెట్, మే 25న లాసెట్, మే 26న పీజీ లాసెట్, మే 27న పీజీఈసెట్, మే 31న ఎడ్‌సెట్ నిర్వహించారు. ఎస్సెస్సీ పరీక్షలు ఈసారి కొద్దిగా ముందుకు జరిపితే ఏప్రిల్ 8 నుండి నిర్వహిస్తే ఏప్రిల్ 23 నాటికి పూర్తి చేయవచ్చు. ఏప్రిల్ 17న మహావీర్ జయంతి, 19న గుడ్‌ఫ్రైడే సహా మధ్యలో ఇతర సెలవులు ఉంటాయి. ఒకవేళ 15వ తేదీ నుండి నిర్వహిస్తే ఏప్రిల్ 2వ తేదీకి పూర్తి చేయవచ్చు. సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ చివరిలో జరుగుతాయి కనుక ఎలాంటి ఇబ్బందీ రాదని అంచనా వేస్తున్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలు ఫిబ్రవరి 27 నుండి జరిగే అవకాశం ఉంది. జనవరిలో ఫస్టియర్ స్పెషల్ సబ్జెక్టులు, ఫిబ్రవరి 1 నుండి 20 వరకూ ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయి. బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్ పరీక్షల షెడ్యూలును విడుదల చేసింది. అదే షెడ్యూలులో తెలంగాణ పరీక్షలు కూడా జరిగే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. ఈ అంశాలు అన్నింటినీ దృష్టిలో ఉంచుకుని త్వరలోనే ప్రవేశపరీక్షల షెడ్యూలు రూపకల్పన జరుగుతుందని, రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత షెడ్యూలును విడుదల చేస్తామని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి పేర్కొన్నారు. వచ్చే విద్యాసంవత్సరానికి దాదాపు సెట్‌ల నిర్వహణ బాధ్యతలను గతంలో ఇచ్చే వర్శిటీలకే అప్పగించే అవకాశం ఉందని తెలిసింది. కాగా మరో పక్క ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, బిఈడీ తదితర కోర్సుల ఫీజులను వచ్చే విద్యాసంవత్సరానికి నిర్ధారించాల్సి ఉన్నందున, అందుకు సంబంధించిన నోటిఫికేషన్ల జారీకి ఉన్నత విద్యామండలి సన్నాహాలు చేస్తోంది. అవసరమైతే ఎన్నికల కమిషన్ నుండి అనుమతి తీసుకుని ముందుకు వెళ్తామని ఉన్నత విద్యామండలి అధికారి ఒకరు చెప్పారు. కాలేజీల నుండి తమ స్వీయప్రకటిత ఆస్తులు- వ్యయం నివేదికలను తెప్పించుకోవడం, వాటిని సమీక్షించడానికి కనీసం రెండు మూడు నెలలు పట్టే అవకాశం ఉందని , కాలేజీలు పున:ప్రారంభించే సమయానికి ముందే ఫీజులను నిర్ధారించడం ఉత్తమమని భావిస్తున్నట్టు ఆయన వెల్లడించారు.