తెలంగాణ

మీ దీవెనలతో 100 సీట్లు సాధిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, నవంబర్ 14 : కోనాయిపల్లి వెంకన్న ఆశీర్వాదం, మీ దీవేనలతో వంద సీట్లు సాధించి మళ్లీ అధికారాన్ని చేపడుతానని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ వెల్లడించారు. కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు తీసుకున్న ఏ యుద్ధంలో ఇంతవరకు అపజయం లేదని, అన్ని విజయాలే సిద్ధించాయని కేసీఆర్ స్పష్టం చేశారు. గోదావరి జలాలు తీసుకొచ్చి వెంకటేశ్వరస్వామి పాదాలకు అభిషేకం చేయాలని మంత్రి హరీష్‌రావును కోరుతున్నట్లు తెలిపారు. బుధవారం గజ్వేల్ నియోజక వర్గానికి నామినేషన్ వేసే ముందు సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం కోనాయిపల్లి గ్రామంలో భారీ బందోబస్తు మధ్య ఆపద్ధర్మ సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావుతో కలసి తన సెంటిమెంట్ ఆలయమైన కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నామినేషన్ పత్రాలతో పూజలు చేసి, వేద బ్రాహ్మణుల ఆశీర్వాదం తీసుకొని నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. ఆనంతరం దేవాలయం ప్రాంగణంలో గ్రామస్తులకు అభివాదం చేశారు. ఈసందర్భంగా సీఎం కేసీఆర్ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ కోనాయిపల్లి వెంకన్న స్వామి ఆశీస్సులు, మీదీవేనలు పొందిన తర్వాతనే ఏ యుద్ధానికైన వెళ్లానన్నారు. అన్నిటిని మించి పెద్ద యుద్ధం తెలంగాణ రాష్ట్ర సాధన యుద్ధమని కేసిఆర్ స్పష్టం చేశారు. ఎవరికి నమ్మకం లేని పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నట్లు తెలిపారు. రాష్ట్రాన్ని సాధించుకున్న కొద్ది రోజుల్లోనే ఎవ్వరు నమ్మలేని స్థితిలో సమస్యలను పరిష్కరించుకున్నట్లు పేర్కొన్నారు.
గతంలో కరెంటు కష్టాలు, మోటర్లు కాలిపోయిన బాధలు ఏన్నో మీరు..నేను కలిసి అనుభవించామని, ఇప్పుడు కరెంటు కష్టాలు పోయినాయన్నారు. రైతులు అన్ని రకాలు బాగుండి అప్పులు లేకుండ, స్వయంగా 5నుండి 10 లక్షలు బ్యాంకులో ఉండే విధంగా బంగారు తెలంగాణ తయారవుతుందన్నారు. ఇందుకోసం మన ప్రయాణం ప్రారంభమైందన్నారు. భగవంతుని దయతో కొద్ది రోజుల్లేనే కాళేశ్వరం ప్రాజేక్టు పూర్తికాబోతుందని, నీళ్ల మంత్రి హరీష్‌రావు ప్రత్యేక పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయన్నారు. వచ్చే ఏడాది గోదావరి నీళ్లు రాబోతున్నాయని, కాళేశ్వరం నీటితో కోనాయిపల్లి వెంకన్న స్వామి పాదాలకు అభిషేకం చేయాలని మంత్రి హరీష్‌రావును కోరుతున్నట్లు తెలిపారు. గొప్ప వరాలు ఇచ్చే దేవుడు కోనాయిపల్లి వెంకన్న అన్నారు. వచ్చే ఐదేండ్లలో తెలంగాణ రైతాంగం, యాదవులు దేశంలో అత్యధిక ధనవంతులు మారుతారన్నారు. దళితులు, గిరిజనులు అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తెలంగాణ పేరుగడిస్తుందన్నారు. ఇందుకు ప్రత్యేక కార్యక్రమాలకు రూపకల్పన జరగుతుందన్నారు. అత్యధిక ప్రగతి సాధించిన రాష్ట్రంగా, దేశంలో నెంబర్‌వన్ రాష్ట్రాంగా తెలంగాణ ఆవిర్భవించబోతున్నట్లు తెలిపారు. 24 గంటల కరెంట్ ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ గుర్తింపు పొందిందన్నారు. కొద్ది సమయాల్లో అన్ని సాధించామనిన్నారు. వెంకన్నస్వామితో మరింత అభివృద్ధి సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లాగా చేసుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకున్నామన్నారు. మంత్రి హరీష్‌రావు కృషితో సాగునీటి వస్తుందన్నారు. మరో రెండేళ్లలో సిద్దిపేటకు రైలు కూత విన్పిస్తుందన్నారు. విమానాలు తప్పా ఏమైన అన్ని తెచ్చుకుంటామని, స్వామివారి దయ ఉంటే మున్ముందు విమానాలు కూడ తెచ్చుకుందామన్నారు. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే..నన్ను పెంచి..పెద్దచేసి.. ఇంతవాడిని చేసింది మీరేనన్నారు. ఆకృతజ్ఖత గుండెల్లో ఉందని, మళ్లీ మీ దీవేనతో యుద్ధానికి వెళ్తున్నానని, నిండు మనస్సుతోదీవీంచాలన్నారు. చిరంజీవి హరీష్‌రావును లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలన్నారు. సిద్దిపేటలో బ్రహ్మండమైన మెజార్టీతో దీవించాలని కోరారు. అంతకు ముందు కోనాయిపల్లిలో సీఎం కేసీఆర్‌కు గ్రామస్తులు, మహిళలు ఘన స్వాగతం పలికారు. ఈకార్యక్రమంలో టీఆర్‌ఎస్ నేతలు నిమ్మమల్లారెడ్డి, దువ్వల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.