తెలంగాణ

కాంగ్రెస్ హయాంలోనే బాబ్రీమసీద్‌ను కూల్చేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తకోట, నవంబర్ 15: కాంగ్రెస్ హయాంలోనే బాబ్రీమసీదును కూల్చి వేశారని ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. గురువారం సాయంత్రం కొత్తకోట రోడ్డుషోలో ఆయనతో పాటు ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు ఇంతియాజ్, ఇప్తార్ అహ్మద్ పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మహమూద్ అలీ మాట్లాడుతూ తెలంగాణ కోసం 14 సంవత్సరాలు కష్టపడి రాష్ట్రాన్ని సాధించుకున్నారని, 31 పార్టీలను ఒప్పించి పార్లమెంటులో బిల్లునుపెట్టి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు ముస్లింలకు ఎందుకు రిజర్వేషన్లు ఇవ్వలేదని, టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పార్లమెంటులో 12 శాతం రిజర్వేషన్ బిల్లును సాధించుకుంటామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును అపడానికే తెలంగాణకు చంద్రబాబు మహాకూటమి ద్వారా అడుగుపెడుతున్నాడని, ఈది మహాకూటమికాదు బేకారి కూటమి అని అన్నారు. కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మితే ఇటు రైతులు, ప్రజలు మోసపోతారన్నారు. అంతకు ముందు ఎంపీ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ 67 సంవత్సరాలుగా కాంగ్రెస్ నాయకులు దోపిడీ చేశారని, శంకర సముద్రం రిజర్వాయర్ పనులు కూడా నత్తనడకన కొనసాగాయన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడారు. ఎంపీపీ గుంత వౌనిక నాయకులు చెన్న కేశవరెడ్డి, ఘని, వామన్‌గౌడ్, జగన్ తదితరులు పాల్గొన్నారు.