తెలంగాణ

దివ్యాంగులకు కేసీఆర్ చేసింది సున్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ , నవంబర్ 15: తెలంగాణ రాష్ట్రంలో 20 లక్షలకు పైగా ఉన్న దివ్యాంగుల సంక్షేమాన్ని కేసీఆర్ ప్రభుత్వం గాలికొదిలేసిందని తెలంగాణ దివ్యాంగుల విభాగం కన్వీనర్ సీహెచ్ శ్రీశైలం ఆరోపించింది. దివ్యాంగులపై సవతితల్లి ప్రేమ తప్ప, నిజమైన ప్రేమ లేదని, కేవలం ఫించను ఇచ్చి హక్కులను ఆత్మగౌరవాన్ని తుంగలో తొక్కారని చెప్పారు. దివ్యాంగులకు గురుకుల పాఠశాల , పోటీ పరీక్షలకు స్టడీ సర్కిల్‌ను ఏర్పాటు చేస్తామని అన్నారు. టీఆర్‌ఎస్ వచ్చాక 31 జిల్లాల్లో దివ్యాంగులకు ప్రత్యేక అధికారులను నియమించలేదని, 2016లో పార్లమెంటు ద్వారా దివ్యాంగుల హక్కుల చట్టం వచ్చినా, దానిని ఇంత వరకూ పకడ్బందీగా అమలుచేయడం లేదని అన్నారు. రాష్ట్ర సలహాదారుల కమిటీని, జిల్లా సలహా దారుల కమిటీలు నియమించాల్సి ఉంటుందని, కానీ చట్టం వచ్చి రెండేళ్లు గడచినా, కమిటీలను నియమించలేదని ఆరోపించారు. వికలాంగుల కార్పొరేషన్ పూర్తిగా నిర్వీర్యమైందని, అన్ని కుల సంఘాలకు భవనాలు నిర్మిస్తామని చెప్పిన కేసీఆర్ దివ్యాంగుల సదనాలు, హాస్టళ్లను భవనాలను పట్టించుకోలేదని చెప్పారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకంలో దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని అన్నారని, కానీ అదీ కాగితాలకే పరిమితం అయ్యిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం దివ్యాంగులకు నాలుగు కోట్ల రూపాయిల మేర స్వయం ఉపాథి పథకాలను మంజూరు చేస్తుందని, దానికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాల్సి ఉండగా, ఆ పనిచేయడం లేదని ఆరోపించారు. దివ్యాంగులైన డ్వాక్రా గ్రూప్‌లకు ఇంత వరకూ రుణాలు మంజూరు కాలేదని అన్నారు. దివ్యాంగులకు పనిచేసే 100 స్వచ్ఛంద సంస్థలకు ఎలాంటి ప్రోత్సాహం లేక నిర్వీర్యమైపోతున్నాయని, దివ్యాంగ విద్యార్థులు నష్టపోతున్నారని అన్నారు. రాష్ట్రంలో ఉన్న 21 రకాల వైకల్యం ఉన్న వ్యక్తుల సమగ్ర సర్వే ఇంత వరకూ జరగలేదని, కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక అవినీతి, రైతుల ఆత్మహత్యల్లో మన రాష్ట్రం రెండో స్థానంలో ఉందని, నిరుద్యోగుల్లో మూడో స్థానంలో ఉందని ఇది అభివృద్ధికి చిహ్నమా అని నిలదీశారు.