తెలంగాణ

కేసీఆర్‌కు సీఈఓ, డీజీపీ వత్తాసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 15: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సీఈఓ రజత్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి వత్తాసు పలుకుతున్నారని, వీరిపై కేంద్ర ఎన్నికల కమిషన్ చర్య తీసుకోవాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆయన సీఈఓ రజత్ కుమార్‌ను కలిసి టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా వినతిపత్రం ఇచ్చారు. ఆ తర్వాత మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, ఇప్పటి వరకు తాను టీఆర్‌ఎస్‌పై రెండు సార్లు సీఈఓకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్య తీసుకోలేదన్నారు. సీఎం క్యాంప్ కార్యాలయం అయిన ప్రగతిభవన్‌ను టీఆర్‌ఎస్ ఆఫీస్‌లా కేసీఆర్, కేటీఆర్ వినియోగిస్తున్నా సీఈఓ రజత్ కుమార్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. సీఈఓ, డీజీపీ నేతృత్వంలో రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా జరిగే అవకాశం లేదన్నారు. తనను ప్రభుత్వం వేధిస్తోందని, డీజీపీ సలహా మేరకు తనపై పోలీసులు 41 కేసులు పెట్టారన్నారు. నిజాం కాలంలో సైనికదళాధిపతిగా పనిచేసి ప్రజలను హింసించిన ఖాసిం రజ్వీలా డీజీపీ మహేందర్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తనకు పూర్తిస్థాయి భద్రత కల్పించాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ, డీజీపీ తనకు భద్రత కల్పించలేదన్నారు. డిసెంబర్ 12 న కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, ఆ తర్వాత కేసీఆర్‌కు వత్తాసు పలికిన అధికారులపై చర్యలు తీసుకుంటామని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. కొడంగల్ నియోజకవర్గం తన అనుచరులను పోలీసులు వేధిస్తున్నారని, తాజాగా ఒక గ్రామంలో తన అనుచరులను కోస్గి సీఐ, మద్నూరు ఎస్‌ఐ నేతృత్వంలో పోలీసులు తీవ్రంగా గాయపరిచారన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నారని తెలిపారు.
టీఆర్‌ఎస్‌కు చెందిన ఇద్దరు ఎంపీలు త్వరలోనే కాంగ్రెస్‌లో చేరతారని మరోసారి రేవంత్‌రెడ్డి తెలిపారు. అయితే ఇంతకు ముందే తాను ఈ ప్రకటన చేశానని, దాంతో ఎంపీలలో గిరిజనుడైన సీతారాంనాయక్‌తోపాటు విశే్వశ్వరరెడ్డిలను కేసీఆర్ అనుమానించి వారితో వివరణ తీసుకున్నట్టు మీడియాలో వచ్చిందన్నారు.