తెలంగాణ

బీజేపీ మూడో జాబితా విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 15: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో అభ్యర్ధులను ఖరారు చేసిన బీజేపీ గురువారం రాత్రి మూడో జాబితాను విడుదల చేసింది. మూడో జాబితాలో 20 నియోజకవర్గాల అభ్యర్ధులను ప్రకటించింది. ఎల్లారెడ్డి నుండి లక్ష్మారెడ్డి, వేములవాడ నుండి ప్రతాప రామకృష్ణ, హుజారాబాద్ పుప్పాల రఘు, హుస్నాబాద్ నుండి చాడా శ్రీనివాసరెడ్డి, మెదక్ నుండి ఆకుల రాజయ్య, నారాయణ్‌ఖేడ్ నుండి డాక్టర్ జి రవి కుమార్ గౌడ్, సంగారెడ్డి నుండి బి రాజేశ్వర్ రావు దేశ్‌పాండే, పటాన్‌చెర్వు నుండి పి కరుణాకర్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం నుండి కొత్త అశోక్ గౌడ్, చేవెళ్ల నుండి కంజర్ల ప్రకాష్, నాంపల్లి నుండి దేవర కరుణాకర్, సికింద్రాబాద్ నుండి సతీష్‌గౌడ్, కొడంగల్ నుండి నాగూరావు నామాజీ, మహబూబ్‌నగర్ నుండి జి పద్మజా రెడ్డి, ఆలంపూర్ నుండి రజని మాధవ రెడ్డి, నల్గోండ నుండి శ్రీరామోజు షణ్ముఖ,
నకిరేకల్ నుండి కసర్ల లింగయ్య, మహబూబాబాద్ నుండి జ్యోతుల హుస్సేన్ నాయక్, ఖమ్మం నుండి డాక్టర్ ఉప్పల శారద, మధిర నుండి డాక్టర్ శ్యామల రావుల పేర్లను ఖరారు చేశారు. మొదటి జాబితాలో 38 మంది పేర్లను ప్రకటించిన బీజేపీ రెండో జాబితాలో 28 మంది పేర్లను ప్రకటించింది. తాజా జాబితాలో 20 పేర్లను ప్రకటించింది. దీంతో ఇంత వరకూ 86 పేర్లను ప్రకటించినట్టయింది. మరో 33 పేర్లతో తుది జాబితాను రెండు రోజుల్లో ప్రకటించనున్నట్టు తెలిసింది.
నడ్డాను అడ్డుకున్న అనుచరులు
టీడీపీ, కాంగ్రెస్ పార్టీలలో జరుగుతున్న టిక్కెట్ల లొల్లి బీజేపీనీ విడనాడలేదు. రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మంత్రి జెపీ నడ్డా వాహనాన్ని జూబ్లీ హిల్స్‌లో బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఆయన తన కారు దిగి వారిని పలకరించి, మరో కారులో అక్కడి నుండి వెళ్లిపోయారు. ఇంకో పక్క వందలాది కార్యకర్తలు పార్టీ కార్యాలయానికి గురువారం నాడు చేరుకుని తమ అభ్యర్ధికే టిక్కెట్ కేటాయించాలంటూ నినాదాలు చేశారు.
జూబ్లీహిల్స్ నుండి తమ అభ్యర్థికి అవకాశం కల్పించాలని వారు కోరారు. అక్కడే ఉన్న కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయను వారు ఘెరావ్ చేశారు. పటాన్‌చెర్వు టిక్కెట్ ఇవ్వనందుకు నిరసనగా బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు గాలి గిరి పేర్కొన్నారు.