తెలంగాణ

టీఆర్‌ఎస్‌కు తుర్కపల్లి జడ్పీటీసీ రాజీనామా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తుర్కపల్లి, నవంబర్ 15: యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని ఆలేరు నియోజకవర్గం తాజామాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ అభ్యర్ధి గొంగిడి సునీత పనితీరును నిరసిస్తు తుర్కపల్లి జడ్పీటీసీ బోరెడ్డి జ్యోతి అయోధ్యరెడ్డి టీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా ప్రకటించారు. గురువారం ఆమె విలేఖరులతో మాట్లాడుతు ఆలేరు నియోజకవర్గానికి పట్టిన శని గొంగిడి సునీతామహేందర్‌రెడ్డిలంటు ఆమె విమర్శించారు.
నియోజకవర్గం ని విస్మరించి మద్యం వ్యాపారాల నుండి, రియల్ ఎస్టెట్ వ్యాపారుల నుండి డబ్బులు పొగేసుకుంటు వారి కొమ్ము కాస్తు ప్రజల తాగుసాగునీటి సమస్యలను సునీతమహేందర్‌రెడ్డిలు పట్టించుకోలేదంటు జ్యోతి ఆరోపించారు. వందల కోట్లు పోగేసుకున్న సునీతామహేందర్‌రెడ్డిలు నియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్‌రూమ్ నిర్మించలేదన్నారు.
యాదగిరిగుట్టలో హోటళ్లు, హైద్రాబాద్‌లో భవంతులు సంపాదించుకున్నారని, యాదాద్రి చుట్టుపక్కల బీనామీలు, బంధువుల పేర్లతో వందల ఎకరాల భూములు, ఆస్తులు కూడబెట్టుకోవడంలో చూపిన శ్రద్ధ ప్రజలకు వౌలిక సదుపాయలు కల్పించడంలో చూపలేదన్నారు. తుర్కపల్లిలో 30పడకల ఆసుపత్రి మంజూరుకు అడ్డుపడ్డారన్నారు. మండలంలో అభివృద్ధి పనులకు మంత్రులు వస్తామంటే అడ్డుపడ్డారన్నారు. పదవులు, పైరవీలు, సంపాదనలు తప్ప ప్రజల సమస్యలు పట్టని గొంగిడి సునీతమహేందర్‌రెడ్డిల వ్యవహారశైలికి వ్యతిరేకంగా తాను టీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా జ్యోతి తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఆలేరు మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ గుడిపాటి మధుసూధన్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ గట్టు స్వరూప నరేందర్‌తో పాటు పలువురు టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసినట్లుగా ఆమె తెలిపారు. ఇప్పటికే సునీతపై అసంతృప్తితో నియోజకవర్గంలోని ఏడు మండలాల పరిధిలోని మరికొంత మంది ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు సైతం టీఆర్‌ఎస్‌ను వీడనున్నట్లుగా జ్యోతి తెలిపారు.