తెలంగాణ

కేసీఆర్‌ను కలవాలని 70 రోజులు ఎదురుచూశా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 15: టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను కలిసి తన గురించి చెప్పాలని 70 రోజులు ఎదురుచూసినా ఫలితం లేకపోయిందని, అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ పేర్కొన్నారు. రాజకీయంగా తనను సమాధి చేయడం కోసమే తనకు అపాయింట్ ఇవ్వలేదని ఆమె చెప్పారు. గురువారం నాడు ఆమె బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్, జీ కిషన్‌రెడ్డి, బండారు దత్తాత్రేయల సమక్షంలో బీజేపీ తీర్ధం తీసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం జలదృశ్యం మొదలు ఇంత వరకూ ఫుల్‌టైమ్ వర్కర్‌గా తాను టీఆర్‌ఎస్‌కు పనిచేశానని పేర్కొన్నారు. కవిత, కేటీఆర్, వినోద్ కుమార్, కేకేలను తాను కలిసినా ఫలితం లేకపోయిందని, ఉద్యమ కారిణిగా తాను ప్రగతి భవన్‌లో అడుగుపెట్టలేకపోయానని చెప్పారు. పార్టీ రాజ్యసభ సభ్యుడు ఒకరు తనకు అడ్డుపడ్డారని, ఆయన వల్లనే తాను టిక్కెట్ పొందలేకపోయానని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ను అరెస్టు చేసి, కారం పోడి పట్టుకున్న బిడ్డను తానని, 90 శాతం పనిచేసిందని రిపోర్టు వచ్చిందని, అయినా ఎందుకు టిక్కెట్ ఇవ్వలేదో తెలియడం లేదని వాపోయారు. ప్రజల తీర్పు , రిపోర్టు ప్రకారమే టిక్కెట్లు ఇస్తే తనకు ఇవ్వాలని, ఆ మాట ఏమైందని ప్రశ్నించారు. 119 మందిలో తాను దళిత బిడ్డనని, మాదిగ బిడ్డనని తనకు అన్యాయం చేశారని పేర్కొన్నారు. రవీందర్ రావు, కేసీఆర్ సడ్డకుడు తనకు టిక్కెట్ రాకుండా ఆపారని ఆరోపించారు. 119 అసెంబ్లీల్లో మాదిగలు అంతా టీఆర్‌ఎస్‌ను వ్యతిరేకించాలని ఆమె పిలుపునిచ్చారు. సీఎం చుట్టూ తిరిగే వాళ్లు తమ నాయకులకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని, చొప్పదండిలో తాను బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుస్తానని చెప్పారు.
తెలంగాణలో కవిత ఒక్కరే ఆడబిడ్డనా తాను కాదా అని నిలదీశారు. అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్‌లో కూడా కొంత మంది నేతల పెత్తనమే నడవలా అని ప్రశ్నించారు.