రాష్ట్రీయం

వరంగల్ జిల్లాలో రెబెల్స్ బెడద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికలభూమి
==========
* జనగామ సీటుపై కాంగ్రెస్ దోబూచులాట * సీటు నీకా..నాకా..కాంగ్రెస్, టీజెఎస్ మధ్య పోటాపోటీ
* వరంగల్ తూర్పు టీఆర్‌ఎస్ అభ్యర్థిగా నన్నపునేని నరేందర్
* మూడో జాబితా కోసం కాషాయ ఆశావాహులు ఎదురుచూపులు
వరంగల్, నవంబర్ 15: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రధాన పార్టీ అభ్యర్థులకు రెబెల్స్ బెడద తప్పేటట్లు లేదు. జిల్లాలో ప్రస్తుతం అందరి దృష్టీ పొన్నాల లక్ష్మయ్యపైనే పడింది. ఒక సీనియర్ బీసీ నేత, మాజీ టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు టికెట్ దక్కకపోవడం పట్ల సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పొన్నాల లక్ష్మయ్యకు టికెట్ రాదనే విషయాన్ని ఎవరూ ఉహించరు. కాంగ్రెస్‌లో పొన్నాలకు టికెట్ దక్కకపోవడాన్ని ముఖ్యంగా ఆయన కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. జనగామ మున్సిపాలిటీకి చెందిన 13మంది కౌన్సిలర్లు ఇప్పటికే మూకుమ్మడి రాజీనామలు చేశారు. మహాకూటమి పొత్తులో భాగంగా జనగామ స్థానాన్ని టీజేఎస్‌కు కేటాయించే అవకాశాలు మెండుగా కన్పిస్తుండగా తాజాగా ఈ స్థానాన్ని చేర్యాల మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి కాంగ్రెస్ లేదా టీజేఎస్ నుండి పోటీకి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఈ సీటు కోసం పొన్నాల లక్ష్మయ్య ఢిల్లీ స్థాయిలో హోరాహరీగా పోరాడుతున్నారు. జనగామ స్థానం కోసం టీజేఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు సీటు నీకా.. నాకా అన్నట్లుగా ముమ్మరంగా ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్, మహాకూటమి అభ్యర్థులతో పాటు బీజెపి అభ్యర్థులకు కూడా రెబెల్స్ బెడద తప్పేటట్లు లేదు. వరంగల్ పశ్చిమలో మహాకూటమి తరుపున టీడీపీ అభ్యర్థి రేవూరి ప్రకాశ్‌రెడ్డికి కేటాయించడం పట్ల కాంగ్రెస్ నుండి మొదటి నుండి ఈ స్థానాన్ని ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి కాంగ్రెస్‌పై తిరుగుబాటు ఎగరవేసి బరిలో ఉండేందుకే నిర్ణయించుకున్నారు. గురువారం వరంగల్ నగరంలో కాంగ్రెస్ కార్యకర్తలతో భారీ ర్యాలీ ప్రదర్శన చేసి బల ప్రదర్శన చేపట్టారు. ఇప్పటికే కాంగ్రెస్ టీకెట్ తనకే వస్తుందని ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. టికెట్ దక్కని పక్షంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో ఉండేందుకు నిర్ణయించుకున్నారు. మరోవైపు బీజేపీ వరంగల్ పశ్చిమ అభ్యర్థికి మార్తినేని ధర్మారావుకు కూడా రెబెల్ బెడద తప్పడం లేదు. ఆ పార్టీ అర్భన్ అధ్యక్షురాలు రావుపద్మ స్వతంత్య్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఇక భూపాలపల్లి జిల్లా టీఆర్‌ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ గండ్ర సత్యనారాయణరావు కూడా రెబెల్ అభ్యర్థిగా రంగంలో ఉండి ప్రధాన పార్టీ అభ్యర్థులకు ముచ్చెముటలు పట్టిస్తున్నారు. ఇక స్టేషన్ ఘనపూర్‌లో ఇప్పటికే టీఆర్‌ఎస్ అభ్యర్థి రాజరాపు ప్రతాప్‌కు ఆ పార్టీ రెబెల్ అభ్యర్థిగా ముందుగా ప్రచారం చేపట్టిన రాజారాపు ప్రతాప్ ఇటీవలె బీఎస్పీ పార్టీలో చేరారు. ఇక ఇదే నియోజకవర్గంలో కాంగ్రెస్ టికెట్ అశించిన మాజీ మంత్రి విజయరామరావుకు టికెట్ దక్కక పోవడంతో ఆయన స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారని అన్నారు. టీఎర్‌ఎస్‌కు కీలకంగా ఉన్న వరంగల్ తూర్పు స్థానాన్ని మేయర్ నన్నపునేని నరేందర్‌కు కేటాయించారు. ఇక్కడ టికెట్ ఆశిస్తున్న మాజీ మంత్రి బస్వరాజు సారయ్యతో పాటు, మాజీ ఎంపీ గుండు సుదారాణి, పార్టీ సీనియర్ నేత, న్యాయవాదీ గుడిమిల్ల రవీకుమార్‌లకు చుక్కెదురైంది. ఇక వరంగల్ తూర్పు నుండి మహాకూటమి పొత్తులో భాగంగా కాంగ్రెస్ లేదా టీజేఎస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. టీజేఎస్ మొదటి నుండి అభ్యర్థి గాదె ఇన్నయ్య పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. టీజేఎస్‌కు జనగామ, వర్ధన్నపేట రెండు స్థానాలు ఇచ్చినట్లైతే వరంగల్ తూర్పు కాంగ్రెస్‌కు దక్కే అవకాశం ఉంది. ఇక్కడి నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పెద్ద వ్యాపార వ్యక్తిని రంగంలోకి దింపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తునట్లు తెలిసింది. నేడు రేపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో అన్ని పార్టీలలో సీట్ల లెక్క తేలనుంది.