రాష్ట్రీయం

ఖమ్మం సభతో పెరగనున్న ధీమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికల భూమి
===========
ఖమ్మం, నవంబర్ 16: నామినేషన్ల పర్వం పూర్తికాగానే టీఆర్‌ఎస్ తొలి బహిరంగ సభ ఖమ్మం నగరంలో జరగనున్నది. ఈ నెల 19వ తేదీన జరగనున్న ఈ సభకు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో పాటు ఆ పార్టీ ప్రధాన నేతలు పాల్గొననున్నారు. ఈ సభకు భారీగా జనసమీకరణ చేయాలని, ఈ సభ ద్వారానే రాష్ట్రంలో టీఆర్‌ఎస్ గెలుస్తుందనే ధీమాను పార్టీ శ్రేణులకు కల్పించాలని నిర్ణయించిన పార్టీ నాయకత్వం అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నది. ఆపద్ధర్మ మంత్రి, పాలేరు టీఆర్‌ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఖమ్మం అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్ ఈ మేరకు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. రెండులక్షల మందికి పైగా పట్టే ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాట్లను చేస్తున్నారు. రెండు నియోజకవర్గాల పరిధిలోని అన్ని గ్రామాల నుంచి ప్రజలు ఈ సభకు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం తుమ్మల, అజయ్ విలేఖరులతో మాట్లాడుతూ నాడు తెలంగాణ ఉద్యమం ఖమ్మం నుంచే ప్రారంభమైందని, నామినేషన్ల ఘట్టం పూర్తయిన తరువాత జరిగే సభ ఖమ్మం నుంచే ప్రారంభమవుతుందని, ఈ సభకు వచ్చే వారంతా టీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లోని ప్రతి గ్రామం నుంచి అధిక సంఖ్యలో ప్రజలు స్వచ్చందంగా సభకు వచ్చేందుకు సన్నద్ధమవుతున్నారన్నారు. నాలుగున్నరేళ్ళ పాటు అప్పుడప్పుడు వచ్చిపోయే వారు ఇప్పుడు కూటమి అభ్యర్థులుగా వచ్చి ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రపంచబ్యాంకు కూడా బ్లాక్‌లిస్టులో పెట్టిన కంపెనీకి అధినేతగా ఉండి రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని స్వయంగా చూస్తూ కూడా విమర్శలు చేయడం బాధకలిగిస్తున్నదన్నారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన కేసిఆర్ రెండేళ్ళ తరువాత ఖమ్మంకు వస్తున్నారని, దీనిని విజయవంతం చేసి ఆ సభ స్పూర్తితో ప్రచారాన్ని మరింత ముమ్మరం చేస్తామన్నారు. మహాకూటమి నేతలు చేస్తున్న విమర్శలకు ప్రజలే జవాబిస్తారని, ఇప్పటికకే పలుచోట్ల వారిని ప్రశ్నిస్తున్నారని వెల్లడించారు. కూటమి పార్టీలలోని నేతలు కూడా అభివృద్ధి జరిగిందని చెబుతుంటే అభ్యర్థులు మాత్రం ఆ రోడ్లపై తిరుగుతూనే ఏమి లేదని చెప్పడం దారుణమన్నారు.