తెలంగాణ

ఇంకా తేలని కుత్బుల్లాపూర్ పంచాయతీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 16: తెలంగాణలో ఎన్నికల్లో భాగంగా కుత్బుల్లాపూర్ తెలుగుదేశం పార్టీ పంచాయతీ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు వద్దకు చేరింది. ఎప్పటి నుంచో పార్టీకి అంకితభావంతో పనిచేస్తున్న తమను కాదని, మరో పార్టీకి అవకాశం ఇస్తున్నారంటూ నియోజకవర్గం నేత హనుమంతరావు నేతృత్వంలో పలువురు నాయకులు, కార్యకర్తలు శుక్రవారం ఉండవల్లి ప్రజావేదిక హాల్‌లో పార్టీ అధినేత చంద్రబాబునాయుడును కలిసి ఫిర్యాదు చేశారు. కూటమి పొత్తుల్లో భాగంగా కుత్బుల్లాపూర్‌లో ఎంపిక ఉంటుందని, అవసరమైతే పార్టీ అధ్యక్షుడ్ని కలవాలని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ సూచించారని ఇందులో భాగంగా తాను చంద్రబాబును కలిసినట్లు హనుమంతరావు మీడియాకు తెలిపారు. ఎన్టీఆర్ హయాం నుంచి నియోజకవర్గంలో పార్టీ బలోపేతంగా ఉందన్నారు. అధినేత అవునన్నా, కాదన్నా తాను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచేది ఖాయమని తేల్చిచెప్పారు. ఎంత ఖర్చుకైనా వెనుకాడకుండా తాము ఎన్నికల్లో విజయం సాధించి పార్టీ అధ్యక్షుడి వద్దకు వస్తామని స్పష్టం చేశారు. అయితే ఈ స్థానం పొత్తులో భాగంగా ఏ పార్టీకి ఇస్తారనేది ఇంకా తేలలేదని చెప్పారు. గెలిచే నియోజకవర్గాల్లో పొత్తుల పేరిట ఇతర పార్టీలకు అవకాశమిస్తే ఓటమి చవిచూసే అవకాశాలు లేకపోలేదన్నారు. ఇదిలా ఉండగా నామినేషన్ల ప్రక్రియ మరో రెండు రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్ పార్టీ నుంచి టీడీపీలోకి వలసలు మొదలయ్యాయి. టీఆర్‌ఎస్ నేత ఉప్పు రామకృష్ణతో పాటు తెలంగాణ రిటైర్డ్ డిప్యూటీ లేబర్ కమిషనర్ కేవీ రవీంద్రనాథ్‌లు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌తో సహా రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు చేసిన కృషి అనిర్వచనీయమని ఇందులో భాగంగా తెలంగాణ అభివృద్ధిని కాంక్షించి తాము టీడీపీలో చేరుతున్నట్లు రామకృష్ణ, రవీంద్రనాథ్ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా కూకట్‌పల్లికి చెందిన తెలుగుదేశం కార్యకర్తలు పలువురు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలుసుకున్నారు. ఇప్పటికే నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా దివంగత రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినిని ప్రకటించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో పార్టీ అభ్యర్థి విజయానికి అంతా కలసికట్టుగా పనిచేయాలని బాబు కోరారు.