తెలంగాణ

ప్రజా సంక్షేమమే పరమావధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 16: ప్రజా సంక్షేమమే పరమావధిగా బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను తయారుచేసింది. మేనిఫెస్టో కమిటీ తమ నివేదికను శుక్రవారం నాడు పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్‌కు అందజేశారు. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఎన్ వీ ఎస్ ఎస్ ప్రభాకర్, ఇతర కమిటీ సభ్యులు ముషీరాబాద్‌లో లక్ష్మణ్‌ను కలిసి నివేదిక అందించారు. దీనికి మరింత పదును పెట్టి ఒకటి రెండు రోజుల్లో పార్టీ విడుదల చేయనున్నట్టు తెలిసింది. ప్రధానంగా నిరుద్యోగ నిర్మూలన, సంక్షేమ పథకాలు, మహిళా సంక్షేమం, గిరిజన సంక్షేమం, ఫీజుల రీయింబర్స్‌మెంట్, పాఠశాల ఫీజుల నియంత్రణ, అన్ని ప్రాంతాల ప్రజలకు తాగునీటి వసతి, ప్రాజెక్టుల పూర్తి చేయడం, తక్కువ ధరకే ప్రజలకు తాగునీటి సరఫరా, రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం, విద్యా ప్రమాణాలు పెంపు తదితర అంశాలను ప్రధానంగా తీసుకున్నట్టు తెలిసింది.
కిషన్‌రెడ్డి పనితీరుపై పుస్తకం
అంబర్‌పేటను ఏ విధంగా తీర్చిదిద్దిందీ వివరిస్తూ అక్కడి ఎమ్మెల్యే జీ కిషన్‌రెడ్డి రూపొందించిన గ్రంథాన్ని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, పద్మనాభయ్య, మాజీ ప్రధానకార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, జస్టీస్ సీవీ రాములు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ప్రతి ఎన్నికల సమయంలో తాను గతంలో ఇచ్చిన హామీలు, వాటిని అమలు చేసిన తీరును వివరిస్తూ కిషన్‌రెడ్డి గ్రంథ రూపంలో ప్రజా సమీక్షకు విడుదల చేస్తున్నారు. తాను నియోజకవర్గానికి ఏం చేశానో నలుగురికీ చెప్పాల్సిన బాధ్యత ఉందని, ఆ బాధ్యతను సక్రమంగా అమలుచేస్తున్నట్టు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ రాష్టవ్య్రాప్తంగా ఒకవైపు ప్రచారం చేస్తూనే మరో వైపు తన సొంత నియోజకవర్గంలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రతి రోజు ఒక డివిజన్‌లో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. శుక్రవారం నాడు ఆయన బోలక్‌పూర్ ప్రాంతంలో పాదయాత్ర నిర్వహించారు.
కేటీఆర్ రాజకీయ సన్యాసానికి సిద్ధంగా ఉండు
ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, ఇంద్రసేనారెడ్డి తీవ్రంగా స్పందించారు. డిసెంబర్‌లో జరిగే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఓటమి పాలవుతుందని , ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహా ముఖ్యులు అంతా ఓడిపోతారని ఆయన జోస్యం చెప్మారు. మీ నాన్న కేసీఆర్ మాదిరి నువ్వు మాటతప్పవద్దని కేటీఆర్‌కు సూచించారు. కేసీఆర్ ఇచ్చిన ఒక్క వాగ్దానాన్ని నిలుపుకోలేదని, తండ్రి బాటలో నడిచి కేటీఆర్ తప్పులను ఒప్పులను చేయాలని చూదడొద్దని అన్నారు.