తెలంగాణ

బలగాలు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 16: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించడానికి పోలీస్ బలగాలను సిద్ధం చేశామని రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే జిల్లాల్లో పోలీస్ బలగాలకు శిక్షణ ఇచ్చామన్నారు. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు పోలీస్ యంత్రాంగం అప్రమత్తతో వ్యవహరిస్తుందని చెప్పారు. మావోల సవాల్‌ను ఎదుర్కోవడానికి భద్రతా బలగాలకు దిశా నిర్ధేశం చేశామన్నారు. తెలంగాణలో మావోయిస్టుల ప్రభావం ఉన్న ప్రాంతాలను గుర్తించామన్నారు. రాష్ట్ర సరిహద్దుల్లోనే అడ్డగించడానికి బలగాలను రంగంలోకి దింపామన్నారు. తెలంగాణ దండాకారణ్యంలో మావోలు ప్రవేశించారన్న సమాచారం ఉందన్నారు. మావోలను పసిగట్టడానికి డ్రోన్ల అవసరం లేదన్నారు. దట్టమైన అటవీ ప్రాంతల్లో డ్రోన్లతో సమాచారం సేకరించడానికి వీలుకాదన్నారు. అందుకు కేంద్ర బలగాలను తరలిస్తున్నామని చెప్పారు. పొరుగు రాష్ట్రాల నుంచి పోలీస్ బలగాలను రప్పిస్తున్నట్లు చెప్పారు. బందోబస్తుకు ఏమేరకు బలగాలు అవసరమో కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక ఇచ్చామని, త్వరలో బలగాల వివరాలను వెల్లడిస్తానని చెప్పారు. రాష్ట్ర పోలీస్ సిబ్బందిని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటున్నామని ఆయన చెప్పారు. ఓటర్లు వదంతులు నమ్మవద్దని, స్థానిక పోలీస్ సహాయాన్ని తీసుకోవాలని ఆయన సూచించారు. గ్రామ పోలీస్ ఇచ్చే నివేదిక ఆధారంగా ఆయా ప్రాంతాలకు పోలీస్ బలగాలు తరలిస్తామన్నారు.