తెలంగాణ

మాపై ఎలాంటి రాజకీయ వత్తిళ్లూ లేవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 16: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ అఫిడవిట్‌లో తప్పులు జరిగితే కోర్టులో తేల్చుకోవాల్సిందేనని రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి రజత్‌కుమార్ స్పష్టం చేశారు. వాటితో ఈసీకి ఎలాంటి సంబంధం లేదని శుక్రవారం ఇక్కడ స్పష్టం చేశారు. బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ వర్కింగ్ జర్నిలిస్టు ఫెడరేషన్ ఏర్పాటు చేసిన ‘మీట్‌ది ప్రెస్’లో ఆయన పాల్గొన్నారు. మీడియా ప్రతినిధులు ఎన్నికలకు సంబంధించిన పలు ప్రశ్నలకు రజత్‌కుమార్ సమాధానం ఇచ్చారు. ఎన్నికల ప్రాముఖ్యత, ఏర్పాట్లు, ఓటింగ్ కార్యక్రమాలపై ఆయన వివరించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324, 329 వరకు ఎన్నికల గురించి పొందుపర్చడం జరిగిందన్నారు. మొగలులు, చంద్రగుప్తుల కాలం నుంచి అధికారం గురించి ఉందని ఆయన గుర్తు చేశారు. స్వాతంత్య్రం సిద్ధించాక రాజులు పోయారు, రాజ్యాలు పోయి ఎన్నికలు వచ్చాయన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలను చాలెంజ్‌గా తీసుకుని పనిచేస్తున్నామని ఆయన అన్నారు. తమపై ఎలాంటి రాజకీయ వత్తిళ్లు లేవని ఆయన తెలిపారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడానికి రాష్ట్ర యంత్రాంగంతో పాటు కేంద్ర బలగాలు సమష్టిగా పని చేస్తాయని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలతో పోల్చాతే తెలంగాణలో ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా జరుగుతున్నాయని చెప్పారు. గతంలో పోలింగ్ బూత్‌లను ఆక్రమించేవారని, ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవన్నారు. ఎన్నికల్లో డబ్బు ప్రమేయం తగ్గించడానికి ఎన్నికల నిబంధనలు చాలా ఉన్నాయని చెప్పారు. ఎన్నికలకు సంబంధించి ఒక్కరోజులో మార్పు రావాలంటే కష్టమని, అలా కోరుకుంటే నిరీక్షణ తప్పదని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ దండకారణ్యంలో మావోయిస్టులు చెలరేగే ప్రమాదం ఉందన్న సమాచారం పోలీస్ అధికారులు నివేదికల్లో చూశానన్నారు. మావోయిస్టుల చర్యలను ఎదుర్కోవడానికి బలగాలను మోహరిస్తున్నామని చెప్పారు. ఎన్నికలను బహిష్కరించాలన్న మావోల హెచ్చరికలను ఆయన తప్పుపట్టారు. ప్రజాప్రయోజనాల కోసం ఎన్నికల ప్రక్రయను భారత ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. ఓటర్లను భయభ్రాంతుల్ని చేయడం వంటి పిరికిపంద చర్యలకు పాల్పడవద్దని ఆయన హితవు పలికారు. ఓటర్లకు డబ్బులు పంపిణీ చేయడం సరైంది కాదని అందుకు ప్రజల్ని చైతన్యం చేయడానికి యువతీయువకులు ముందుకు రావాలని ఆయన సూచించారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఫిర్యాదులు అందుతున్నాయని, వాటిని పరిష్కరించడానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశానన్నారు. ఇప్పటి వరకు 12 ఫిర్యాదులు అందాయన్నారు. ఎన్నికలు ముగిసిన 45 రోజు తర్వాత ఎవరైనా ఎలక్షన్ పిటిషన్ దాఖలు చేయవచ్చునని ఆయన సూచించారు. అఫిడవిట్‌లో ఎవరైనా అభ్యర్థి ఒక కాలమ్ నింపకుండా ఉంటే ఆర్వో లిఖిత పూర్వకంగా అభ్యర్థికి చెప్పాల్సి ఉంటుందన్నారు. ఎన్నారై ఓటు నమోదుకు అవకాశం ఇచ్చామని, అయితే తక్కువ మంది ఓటు నమోదు చేసుకున్నారని చెప్పారు.
ది ట్రూ స్టోరీ బుక్ రిలీజ్
ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ పనితీరుపై డాక్టర్ అశోక్ శుక్లా రచించిన బుక్‌ను శుక్రవారం ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి సీనియర్ ఐఏఎస్ అధికారులు హాజరయ్యారు. పుస్తక రచయిత అశోక్ శుక్లా ఢిల్లీలో ఎన్నికల సంఘంలో చాలారోజులు పని చేశారు.