తెలంగాణ

గజ్వేల్ ఆడబిడ్డగా ఆదరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికల భూమి
==========
గజ్వేల్, నవంబర్ 17: బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చ అధ్యక్షురాలుగా మహిళల అభ్యున్నతి కోసం శ్రమిస్తున్న తనను గజ్వేల్ ఆడబిడ్డగా గుర్తించి ఆశీర్వదించాలని ఆకుల విజయలక్ష్మి కోరారు. శనివారం గజ్వేల్ బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన అనంతరం ఆమె విలేఖరులతో మాట్లాడారు. గత నాలుగున్న యేండ్ల వ్యవదిలో 19 రాష్ట్రాలలో బీజేపీ సత్తా చాటగా, మోడీ సారద్యంలో తెలంగాణాలో సైతం అధికారం కైవసం చేసుకుంటామని స్పష్టం చేశారు. అవినీతి కాంగ్రెస్‌ను దేశ ప్రజలు అడ్రస్ లేకుండా చేయగా, ప్రధాని నరేంద్రమోడీ వారు వదిలివెల్లిన అవినీతిని శుద్ది చేసుకుంటూ దేశ అభ్యున్నతికి, పేదల సంక్షేమానికి పాటుపడుతున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ తన మంత్రివర్గంలో మహిళలకు అవకాశం కల్పించకుండా అవమానపర్చగా, రైతులు, మహిళలు, యువత, ఉద్యోగ ఉపాద్యాయులు, ఆర్టీసీ కార్మికులు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది, విద్యార్థులు, పేదల సంక్షేమాన్ని పక్కనబెట్టిన టీఆర్‌ఎస్‌కు ఓటు అడిగే నైతిక హక్కు లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర రథసారది లక్ష్మణ్ ఆదేశాలతో గజ్వేల్‌లో నామినేషన్ వేయగా, చక్కటి స్పందన వస్తున్నట్లు చెప్పారు.