తెలంగాణ

నా కుమార్తెను ఆశీర్వదించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికల భూమి
==========
హైదరాబాద్, నవంబర్ 17: కూకట్‌పల్లి నియోజకవర్గం నుండి చుండ్రు (నందమూరి) సుహాసినిని గెలిపించాలని సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ పేర్కొన్నారు. తన అన్న కుమార్తె, తన కుమార్తె అయిన సుహాసిని నందమూరి వంశం నుండి మూడోతరం మహిళ అని, ఆమెను అంతా ఆశీర్వదించాలని బాలకృష్ణ పేర్కొన్నారు. టీడీపీ జాతీయ అధినేత ఎన్ చంద్రబాబునాయుడు సుహాసిని అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేయడంతో ఆమె శనివారం నాడు ఎన్టీఆర్ ఘాట్‌లో ఎన్టీ రామారావుకు, మహాప్రస్థానంలో తన తండ్రి నందమూరి హరికృష్ణకు నివాళులు అర్పించిన అనంతరం జీహెచ్‌ఎంసీ మూసాపేటలోని కూకట్‌పల్లి సర్కిల్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె వెన్నంటే బాలకృష్ణ , బాబాయి నందమూరి రామకృష్ణ ఉన్నారు. విదేశాల్లో షూటింగ్‌లో ఉన్న కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్‌లు తన సోదరికి ట్విట్టర్‌లో అభినందనలు తెలిపారు. నందమూరి హరికృష్ణ రవాణా మంత్రిగా ఉన్నపుడే మహిళా కండక్టర్లను అనుమతించారని, మహిళలకు మొదటి నుండి తెలుగు దేశం పార్టీ ఎంతో గౌరవిస్తోందని అన్నారు. మహిళలను గౌరవించినపుడే ఆ దేశం సమాజం సుభిక్షంగా ఉంటుందని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికల్లో మహాకూటమిదే విజయం అని బాలకృష్ణ పేర్కొన్నారు. తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని, తనతో పాటు తన కుటుంబ సభ్యులు కూడా ఎన్నికల ప్రచారంలో ఉంటారని, అవసరమైతే చంద్రబాబునాయుడు సైతం ఎన్నికల ప్రచారం చేస్తారని బాలకృష్ణ చెప్పారు. తమ సోదరి విజయం సాధించాలని పేర్కొంటూ కళ్యాణ్ రామ్ ట్వీట్ చేశారు. ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం అనే సిద్ధాంతంతో తమ తాత టీడీపీని స్థాపించారని వారు పేర్కొన్నారు. టీడీపీ తమకు ఎంతో పవిత్రమైందని అన్నారు. సమాజంలో స్ర్తిలు ఉన్నతమైన పాత్ర పోషించాలని నమ్మే కుటుంబం తమదని అన్నారు. తమ తండ్రి హరికృష్ణ టీడీపీకి ఎనలేని సేవలు అందించారని కళ్యాణ్ రామ్ పేర్కొన్నారు.