రాష్ట్రీయం

హిందువులు గొంతు విప్పాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికల భూమి
==========
హైదరాబాద్, నవంబర్ 17: హిందువులు అంతా గొంతు విప్పాలని, బీజేపీ పక్షాన నిలవాలని స్వామి పరిపూర్ణానంద వ్యాఖ్యానించారు. శనివారం నాడు ఉప్పల్ ఎమ్మెల్యేగా ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కాగా మరో పక్క పార్టీ సీనియర్ నేత జీ కిషన్‌రెడ్డి అంబర్‌పేట నియోజకవర్గానికి తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో పీఎంఓ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ గాలి వీస్తోందని జితేందర్‌సింగ్ వ్యాఖ్యానించారు.
ఉప్పల్ మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ దాఖలుకు ముందు రామాంతపూర్ సత్యనారాయణ స్వామి టెంపుల్‌లో ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ పూజలు చేశారు. ఈ సందర్భంగా పరిపూర్ణానంద మాట్లాడుతూ ఉప్పల్‌లో మరోమారు ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్‌ను గెలిపించాలని అన్నారు. గత నాలుగేళ్లలో ప్రభాకర్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి 1500 కోట్ల రూపాయిలను నియోజకవర్గ అభివృద్ధికి తీసుకురాగలిగారని అన్నారు. 750 కోట్లతో ఫ్లైఓవర్‌కు రూపకల్పన చేశారని, 12 రిజర్వాయిర్లకు హడ్కో ద్వారా నిధులు తెచ్చి నిర్మించారని , అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సంక్షేమానికి నిరంతరం కృషి చేశారని పరిపూర్ణానంద కితాబు ఇచ్చారు. రాష్ట్రంలో పరిస్థితులను, ప్రభుత్వ పాలన తీరును ప్రజలు అర్ధం చేసుకోవాలని చెప్పారు. గుడికి వెళ్లాలంటే కూడా అడుగడుగునా పోలీసులు అడ్డుపడుతున్నారని, అనేక ఆంక్షలు పెడుతున్నారని చెప్పారు. హిందుధార్మికులు తమ గొంత వినిపించారని, ఇపుడు ఎన్నికల్లో తమ సత్తా చూపాలని అన్నారు. తాను కూడా ఉప్పల్‌లో ప్రభాకర్ తరఫున ప్రచారం చేస్తానని అన్నారు. విజయం సాధించిన వెంటనే ప్రభాకర్‌కు మంత్రివర్గంలో పోస్టు వస్తుందని చెప్పారు. అవినీతి ఆరోపణలు లేని ఏకైక ఎమ్మెల్యే ప్రభాకర్ అని అన్నారు. ఉప్పల్ అభివృద్ధిలో అంతా భాగస్వామ్యులు కావాలంటే ప్రభాకర్ గెలవాలని అన్నారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో భూగర్భ డ్రైనేజీ ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమని అన్నారు. టీడీపీ, కాంగ్రెస్‌లు దశాబ్దాలుగా చేయలేని పనులు తాను నాలుగేళ్లలో చేశానని చెప్పారు.