తెలంగాణ

ఆ గుర్తులంటే.. ఏనుగంత బలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, నవంబర్ 17: ప్రధాన పార్టీలపైనే గంపెడాశలు పెట్టుకొని టికెట్ల కోసం నిన్నటి వరకు పడరాని పాట్లు పడి భంగపడ్డ నేతలు ఏలాగైనా బరిలో నిలువాలన్న తపనతో గుర్తుల కోసం జాతీయ పార్టీల నేతల వద్ద క్యూ కడుతున్నారు. మహాకూటమి, టీఆర్‌ఎస్, బిజెపి టికెట్ల కోసం తుదివరకు ప్రయత్నించి విఫలమైన నేతలకు ప్రస్తుతం తమ ముందు బిఎస్పీ, ఎన్‌సిపి పార్టీలు ఆశాకిరణంలా కనిపిస్తున్నాయి. ఇందుకు కారణం ఆదిలాబాద్ జిల్లా మహారాష్టక్రు ఆనుకొని ఉండడం, ఇక్కడి ఓటర్లకు మహారాష్ట్ర పార్టీలతో సత్సబంధాలు కలిగి ఉన్న నేపథ్యంలో అభ్యర్థులను చూడకుండా పార్టీ గుర్తులకు ఓట్లురాలే అవకాశం ఉండడంతో కీలక నేతలంతా జాతీయ పార్టీ గుర్తుల కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా ఏదో గుర్తుపై పోటీ చేసే బదులు ఆయా పార్టీలకు కాస్తోకూస్తో ఉన్న ఓటు బ్యాంకుతో ఈ ఎన్నికల్లో గెలిచేందుకు తరుణోపాయంగా ఆశావాహులు పార్టీ కార్యాలయాలకు క్యూ కడుతున్నారు. ముథోల్‌లో కాంగ్రెస్ టికెట్ దక్కక నిరాశకు గురైన మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్‌ను స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో ఉండాలని కార్యకర్తలు ఒత్తిడి తేవడంతో ఆయన ఈమేరకు పోటీకి సిద్దమయ్యారు. ముథోల్‌కు ఆనుకొని ఉన్న మహారాష్టల్రో నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి)కి ప్రజాధరణ ఉండడంతో అక్కడి నేతలను సంప్రదించి గోడ గడియారం గుర్తును సాధించుకున్నారు. ఎన్‌సిపి తరపున పోటీచేసి గెలుస్తానని పటేల్ ధీమా వ్యక్తం చేస్తుండడం గమనార్హం. ఈ నియెజకవర్గంలో మరాఠీల ప్రభావం అధికంగా ఉండడంతో ముఖం చూసి కాకుండా పార్టీ గుర్తుపై కనీసం పది వేల వరకు ఓట్లు రాలుతాయని అంచనా వేస్తున్నారు. మరోవైపు మంచిర్యాలలో టీఆర్‌ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ ఎంపిపి బేర సత్యనారాయణ ఉత్తర్‌ప్రదేశ్‌లోని బిఎస్పీ అధినేత్రి మాయావతిని కలిసి ఏనుగు గుర్తును సాధించుకొని బరిలో నిలిచారు. ఆదిలాబాద్, సిర్పూర్‌టి నియోజకవర్గాల్లో సైతం మహారాష్టక్రు ఆనుకొని సంబంధాలు కూడా కలిగి ఉండడంతో దళితుల, మరాఠాలు బి ఎస్పీని ఆదరిస్తారని గ్రహించి ఏనుగు గుర్తుపై పోటీచేస్తూ తమ ఆదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆదిలాబాద్‌లో బీసి సంఘం జిల్లా అధ్యక్షుడు ఈర్ల సత్యం ఏనుగు గుర్తుపై బరిలో నిలిచి ప్రచారంలో హోరెత్తిస్తుండగా సిర్పూర్‌టిలో కాంగ్రెస్ కీలక నేత రావి శ్రీనివాస్‌కు టికెట్ దక్కకపోవడంతో బి ఎస్పీ పార్టీ బిఫాంతో నామినేషన్ వేయడం రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది. ఏనుగు గుర్తుపై పోటీచేసిన కోనేరు కోనప్ప సమీప ప్రత్యర్థి టీఆర్‌ఎస్ అభ్యర్థిపై 8,497 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించి రాష్ట్ర రాజకీయాల్లో రికార్డును నమోదు చేసుకున్నారు. అదే విధంగా గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి బిఎస్పీ పార్టీ అందించిన ఏనుగు గుర్తుతో పోటీచేసి సమీప ప్రత్యర్థి టీఆర్‌ఎస్ అభ్యర్థిపై 8837 ఓట్లతో విజయం నమోదు చేసుకున్నారు. జిల్లాలో ఇద్దరు బి ఎస్పీ పార్టీ గుర్తుతో గెలిచి అనూహ్య విజయాలు సొంతం చేసుకోగా వీరి విజయ గాథలే స్ఫూర్తిగా కీలక నేతలంతా ఈసారి బిఎస్పీ, ఎన్‌సిపి గుర్తుకోసం క్యూ కడుతుండడం గమనార్హం. తాజాగా మాజీ మంత్రి గడ్డం వినోద్ టీఆర్‌ఎస్ రెబల్‌గా బీఎస్పీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నారు.