తెలంగాణ

పంతం నెగ్గించుకున్న పొన్నాల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 17: పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఎట్టకేలకు జనగామ సీటును సాధించి తన పంతాన్ని నెగ్గించుకున్నారు. ప్రజా కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ ఈ సీటును కూటమిలో భాగస్వామ్యపక్షమైన తెలంగాణ జన సమితికి కేటాయించిన సంగతి తెలిసిందే. దీంతో టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ జనగామ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. కాగా, పార్టీలో సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడైన పొన్నాల అవమానంగా భావించారు. హుటాహుటిన ఢిల్లీకి వెళ్ళి అధిష్టానాన్ని కలుసుకున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా పొన్నాలకు టిక్కెట్ కేటాయించకపోవడంతో అవాక్కైయ్యారు. అయితే అక్కడి పరిస్థితులను బట్టి మీరు పరిష్కరించుకోవాలని రాహుల్ సున్నితంగా చెప్పారు. అయినా పొన్నాల హస్తినలోనే భీష్మించుకుని కూర్చున్నారు. మరోవైపు ప్రొఫెసర్ కోదండరామ్ నేతృత్వంలో సమావేశమైన కోర్ కమిటీ సభ్యులు జనగామ సీటు విషయంలో వెనకడుగు వేయరాదని పట్టుబట్టింది. ఇలా నాలుగైదు రోజుల పాటు ఇరు పార్టీల నేతలు పంతాలకు వెళ్ళారు. కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చేందుకు 8 స్థానాలకు టీజేఎస్ అభ్యర్థులను ప్రకటించింది. దీంతో కూటమి నుంచి టీజేఎస్ తప్పుకోనున్నదన్న ప్రచారం జరిగి, గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇక లాభం లేదనుకున్న టీ.పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్‌సి కుంతియాతో కలిసి అక్కడ పొన్నాలతో జరిపిన చర్చలు ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో శుక్రవారం రాత్రి ఉత్తమ్‌కుమార్ హైదరాబాద్ చేరుకుని టీజేఎస్ కార్యాలయానికి చేరుకుని ప్రొఫెసర్ కోదండరామ్‌తో మంతనాలు జరిపారు. అయినా కొలిక్కి రాలేదు. మీరు చెప్పినట్లుగానే తక్కువ సీట్లు తీసుకుంటున్నా, సీట్ల విషయంలోనూ ఇంత పట్టుదల ఉంటే కష్టమని ప్రొఫెసర్ వారికి చెప్పారు. రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత కుంతియా కూడా హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత ఉత్తమ్, కుంతియా కలిసి అర్థరాత్రి దాటిన తర్వాత 1.35 గంటలకు టీజేఎస్ కార్యాలయానికి చేరుకుని, ప్రొఫెసర్ కోదండరామ్‌తో చర్చించి ఆయన్ను ఒప్పించారు. అధికారంలోకి రాగానే గుర్తింపునిస్తామని, కూటమి ఏర్పాటు చేస్తున్న కామన్ మినిమమ్ ప్రొగ్రాంకు చైర్మన్‌గా ఉండాలని వారు సూచించారు. అందుకు ప్రొఫెసర్ కోదండరామ్ సమ్మతించడంతో పొన్నాల లక్ష్మయ్య ఊపిరి పీల్చుకున్నారు. కామన్ మినిమమ్ ప్రొగ్రాంకు చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ ఉంటారని కుంతియా మీడియాకు చెప్పారు.