తెలంగాణ

మహిళలకు ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 17: తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరుగుతున్న ఎన్నికల సందర్భంగా మహిళలకు ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ రజత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన జారీ చేశారు. మహిళలకు ఏర్పాటు చేసే పోలింగ్ కేంద్రాలకు గులాబీ రంగు వాడాలని తొలుత భావించినప్పటికీ, ఆ తర్వాత ఈ నిర్ణయంలో మార్పు చేశామన్నారు. గులాబీ బదులు ఇతర రంగునే వాడతామన్నారు. ప్రతి శాసనసభా నియోజక వర్గంలో కేవలం మహిళలకోసం ఒక పోలింగ్ బూత్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎన్నికల్లో మహిళలు ఎక్కువ సంఖ్యలో ఓట్లు వేయాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. మహిళలకోసం ఏర్పాటు చేసే ప్రత్యేక పోలింగ్ బూత్‌లో ఉద్యోగులు, భధ్రతా సిబ్బంది అంతా మహిళలే ఉంటారని, అందుకే వీటిని పింక్ బూత్‌లని, సఖి బూత్‌లని అంటారని వివరించారు. ఈ బూత్‌లలో విధులు నిర్వర్తించే సిబ్బంది ధరించే డ్రెస్‌లపై ఎలాంటి ఆంక్షలు లేవని రజత్ కుమార్ స్పష్టం చేశారు. సాధారణంగా మహిళలకు సంబంధించిన కార్యక్రమాల్లో గులాబీ (పింక్) రంగును వాడతారని గుర్తు చేశారు. క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించేందుకు నిర్వహించే ‘పింక్ రన్’ అలాంటిదేనని గుర్తు చేశారు. మహిళలకు సంకేతంగా గులాబీ రంగును వినియోగిస్తారన్నారు. వాస్తవానికి పోలింగ్ కేంద్రాలకు వాడాలనుకున్న గులాబీ రంగుకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదన్నారు. అయితే గులాబీ రంగును వాడే విషయంలో అభ్యంతరాలు వచ్చినందువల్ల తాము కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి ఈ అంశాన్ని తీసుకు వెళ్లామన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ గులాబీ రంగును వాడుతున్నందు వల్ల పోలింగ్ బూత్‌లకు ఈ రంగు వాడవద్దంటూ కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసిందన్నారు.